జూమ్ యాప్‌లో టీడీపీ మహానాడు.. డేట్స్ ఫిక్స్...

ఈ ఏడాది మహానాడును ఆన్ లైన్‌లో జూమ్ యాప్ ద్వారా నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది.

news18-telugu
Updated: May 22, 2020, 4:05 PM IST
జూమ్ యాప్‌లో టీడీపీ మహానాడు.. డేట్స్ ఫిక్స్...
టీడీపీ మహానాడు కార్యక్రమం(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమంపై ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మహానాడును ఆన్ లైన్‌లోనే నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నెల 27, 28న మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేవలం ఆరు గంటల్లో కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే మహానాడులో 14వేల మంది పాల్గొనేలా పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మహానాడు నిర్వహణ, తీర్మానాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. సామాజిక దూరం పాటిస్తూ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
First published: May 22, 2020, 4:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading