Home /News /politics /

TDP TELANGANA EX PRESIDENT L RAMANA TO JOIN TRS ON JULY 16TH KTR WILL GIVE MEMBERSHIP TOMORROW SK

L.Ramana: టీఆర్ఎస్‌లో ఎల్.రమణ చేరికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే...

సీఎం కేసీఆర్, ఎల్. రమణ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్, ఎల్. రమణ (ఫైల్ ఫోటో)

సోమవారం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోనున్నారు ఎల్.రమణ. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు. జులై 16న సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.

    తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరికకు సర్వం సిద్ధమయింది. గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారయింది. సోమవారం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోనున్నారు ఎల్.రమణ. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు. జులై 16న సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. జులై 9న ఆయన టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. తాను టీఆర్ఎస్‌లలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని, ప్రజకు మరింత చేరువవ్వాలని నిర్ణయించుకున్నాని..అందుకే టీడీపీ విడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఎల్. రమణ.

    జులై 8న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎల్.రమణ భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా టీఆర్ఎస్‌లోకి రావాలసిందిగా కేసీఆర్ ఆయన్ను ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇఛ్చారు. ఆ భేటీ జరిగిన మరుసటి రోజే టీడీపీకి గుడ్‌బై చెప్పారు ఎల్.రమణ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్.రమణకు మంచి పట్టుకుంది. ఇక టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన ఆయన స్థానాన్ని భర్తీ చేసే బలమైన బీసీ నాయకుడి కోసం సీఎం కేసీఆర్ అన్వేసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎల్. రమణ వైపు కేసీఆర్ మొగ్గుచూపారు. అంతేకాదు అవసరమైతే హుజురాబాద్ ఎన్నికల్లో బరిలోకి దింపాలని చూస్తున్నారట. ఈటల బీసీ నాయకుడు కావడంతో మరో బీసీ నాయకుడిని బరిలోకి దింపితేనే బాగుంటుందని యోచిస్తున్నారట. ఆయనను హుజూరాబాద్ నుంచి బరిలో దింపడం లేదంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అంశంపై సీఎం కేసీఆర్ ఆయనకు హామీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.

    ఉమ్మడి కరీంనగర్‌తో పాటు తెలంగాణలో బీసీ నాయకునిగా ఎల్. రమణకు గుర్తింపు ఉంది. ఈ నినాదంతోనే కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి సంచలనం సృష్టించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు. చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు అని పేరుంది తెలుగుదేశం నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లినా రమణ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రమణ పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. కేడర్ కూడా లేదు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా టీఆర్ఎస్‌లోకి వెళ్లాలని రమణ నిర్ణయించుకున్నారు. జులై 16న గులాబీ గూటికి చేరనున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, L Ramana, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు