మూడు రాజధానుల బిల్లుపై టీడీపీ వ్యూహం ఇదే...

మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీకి శాసనమండలిలో బలం ఉండటంతో... ఈసారి ఆ పార్టీ ఏరకంగా వ్యహరిస్తుందనే అంశం ఆసక్తి రేపుతోంది.

news18-telugu
Updated: June 17, 2020, 9:37 AM IST
మూడు రాజధానుల బిల్లుపై టీడీపీ వ్యూహం ఇదే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేడు శాసనమండలిలో చర్చకు రానున్న రాజధాని వికేంద్రీకరణ బిల్లు సందర్భంగా ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీకి శాసనమండలిలో బలం ఉండటంతో... ఈసారి ఆ పార్టీ ఏరకంగా వ్యహరిస్తుందనే అంశం ఆసక్తి రేపుతోంది. అయితే ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్సీలకు విప్ జారీ చేసిన టీడీపీ... ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అంతా సభకు రావాలని ఆదేశించింది. అయితే ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొందరు ఎమ్మెల్సీలు మాత్రం సభకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ బిల్లును మరోసారి సెలెక్ట్ కమిటీకి పంపాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకురావాలని టీడీపీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. మండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకుంటామని... ఇది సెలెక్ట్ కమిటీకి వెళ్లే వరకు పోరాడతామని తెలిపారు. దీంతో ఈసారి వైసీపీ ఏరకమైన వ్యూహంతో ఈ బిల్లును మండలిలో గట్టెక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

గతంలో ఈ బిల్లుపై శాసనమండలిలో నడిచిన హైడ్రామా... రాష్ట్ర రాజకీయాల్లో సంచలన సృష్టించింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు మండలి చైర్మన్ ప్రకటించడంతో... మూడు రాజధానుల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే మండలి చైర్మన్ చేసిన ప్రకటన రికార్డ్ కాలేదని మండలి కార్యదర్శి పేర్కొన్నారు. మండలికి పంపిన బిల్లు మూడు నెలల్లోగా మళ్లీ అసెంబ్లీకి రాకపోవడంతో... మరోసారి ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేసింది అధికార పార్టీ. ఇక ఈ బిల్లు ఇప్పుడు మళ్లీ శాసనమండలికి వెళ్లనుండటంతో... అక్కడ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. అయితే రెండోసారి శాసనమండలి ముందుకు రాబోతున్న ఈ బిల్లును ఆమోదించడమో లేక తిరస్కరించడమో చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే మరోసారి ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపితే మాత్రం... మరికొంతకాలం మూడు రాజధానుల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి
Published by: Kishore Akkaladevi
First published: June 17, 2020, 9:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading