• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TDP SRIKAKULAM MP RAMMOHAN NAIDU DAUGHTER NAME MIHIRA NGS

Andhra Pradesh: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి కూతురు పేరు తెలుసా..?

Andhra Pradesh: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి కూతురు పేరు తెలుసా..?

శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూతురి నామకరణ మహోత్సవం వేడుకగా జరిగింది. చిన్నారికి ప్రముఖులంతా శుభాకంక్షలు తెలుపుతూ.. ఆశీర్వదిస్తున్నారు.

శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూతురి నామకరణ మహోత్సవం వేడుకగా జరిగింది. చిన్నారికి ప్రముఖులంతా శుభాకంక్షలు తెలుపుతూ.. ఆశీర్వదిస్తున్నారు.

  • Share this:
    ఉత్తరాంధ్రలో ఇద్దరు కీలక నేతల తమ కూతూళ్లకు ఒకే రోజు నామకరణం చేశారు.. ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి తన కూతురికి జగతి అని నామకరణం చేశారు.. అదే రోజు మరో కీలక నేత.. ఉత్తరాంధ్ర భవిష్యత్తు నాయకుడిగా టీడీపీ నేతలు చెప్పుకునే ఎంపి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా తన కూతురుకి నామకరణం చేశారు.

    తమ గారాల పట్టికి నామకరణం చేసాము అంటూ సోషల్ మీడియాలో ఆనందాన్ని అందరితో షేర్ చేసుకున్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. తన పాప పేరు మిహిర అన్వి శివాంకృతి అంటూ వెల్లడించారు. చిన్నారి జాతక రీత్యా ఆ పేరు పెట్టామన్నారు. అందరూ తన మిహిర ని ఆశీర్వదించాలి అని కోరుతూ పోస్టు పెట్టారు. స్థానిక టీడీపీ నేతలు, సన్నిహిత బంధువుల మధ్య నామకరణ మహోత్సవాన్ని జరిపించారు.

    ఇటీవల ఆయన తనకు పాప పుట్టిందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అందరికీ తెలిసింది. తన భార్య శ్రావ్య, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే ఆ సమయంలో  ఆయన పితృత్వ సెలవులు కావాల‌ని కోరుతూ లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు లేఖ రాయడంపై వివాదం రేగింది. త‌న భార్య బిడ్డకు జన్మనివ్వబోతోందని... ఇలాంటి పరిస్థితుల్లో ఆమె వెంట తాను ఉండాలని కోరుకుంటున్నానని.. వారం రోజుల పాటు సెలవులు కావాలి అంటూ రామ్మోహన్ నాయుడు స్పీకర్‌కు లేఖలో తెలిపారు. అయితే అదే సమయంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి కీలక సమయంలో ఆయన సెలవులు కోరుతూ లేఖ రాయడాన్ని విపక్ష నేతలు తప్పుపట్టారు.

    రామ్మోహన్ నాయుడు భార్య శ్రీ శ్రావ్య మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమార్తె.. ఆమె విశాఖపట్నంలోని గాయత్రీ విద్యా పరిషత్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. భరతనాట్యం కూడా బాగా చేస్తారు. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లో బీటెక్ పూర్తి చేశారు. అమెరికాలో విద్యాభ్యాసం చేసిన రామ్మోహన్ నాయుడు.. తెలుగులోనూ అనర్గళంగా మాట్లాడుతారు.. హిందీ, ఇంగ్లీష్ లపైనా మంచి గ్రిప్ ఉంది. 2012లో తండ్రి ఎర్రన్నాయుడు మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. పార్లమెంట్ లోనూ, బయట తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు.

    ఇది కూడా చదవండి:  సీఎం జగన్, భారతిల పేర్లు కలిసేలా డిప్యూటీ సీఎం కూతురికి నామకరణం

    కింజారపు రామ్మోహన్ నాయుడు 2017 జూన్‌లో మాజీ మంత్రి బండారు సత్యన్నారయణ మూర్తి కూతురు శ్రావ్యను పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల తరువాత వీరికి పాప పుట్టింది. రామ్మోహన్ నాయుడుకి రాజకీయ వారసురాలు వచ్చిందంటూ ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పాపకు నామకరణం కూడా చేయడంతో.. పాపను ఆశీర్వదిస్తూ ప్రముఖులంతా పోస్టులు చేస్తున్నారు.. చిన్నారికి, తల్లి దండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published: