టీడీపీ నేత పట్టాభిపై దుండగుల దాడి... ఆసుపత్రికి తరలింపు

ధ్వంసమైన పట్టాభి కారు(ఇన్‌సెట్‌లో పట్టాభి ఫైల్‌ ఫొటో)

టీడీపీ నేత పట్టాభిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటి నుంచి కారులో బయటకు వెళుతుండగా ఆయనపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో ఆయన గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పట్టాభి కారు అద్దాలు, సెల్‌ఫోన్ ధ్వంసమైనట్లు తెలిసింది. రాడ్లు, కర్రలతో దుండగులు దాడికి పాల్పడ్డారు. పట్టాభిపై రెండు నెలల్లో...

 • Share this:
  విజయవాడ: టీడీపీ నేత పట్టాభిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటి నుంచి కారులో బయటకు వెళుతుండగా ఆయనపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో ఆయన గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పట్టాభి కారు అద్దాలు, సెల్‌ఫోన్ ధ్వంసమైనట్లు తెలిసింది. రాడ్లు, కర్రలతో దుండగులు దాడికి పాల్పడ్డారు. పట్టాభిపై రెండు నెలల్లో రెండోసారి దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనపై పట్టాభి స్పందించారు. 15 మంది వచ్చి తన వాహనంపై దాడి చేశారని, రాడ్లు, కర్రలు, బండ రాళ్లతో దాడి చేశారని చెప్పారు. 10 రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నానని నాపై దాడి చేశారని పట్టాభి ఆరోపించారు. తనను పథకం ప్రకారం హత్య చేయాలని కుట్ర పన్ని దాడి చేశారని పట్టాభి వ్యాఖ్యానించారు.

  వీవీఐపీలు తిరిగే ప్రాంతంలో అల్లరి మూకలు విజృంభించాయని, ఆరు నెలల క్రితం తనపై దాడి చేస్తే కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకున్నారని ఆయన చెప్పారు. అందుకే ఇప్పుడు మళ్లీ తనపై దాడి చేశారని పట్టాభి చెప్పుకొచ్చారు. డీజీపీ, పోలీస్ కమిషనర్ స్పందించి ఇక్కడకి రావాలని, డీజీపీ వచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చే వరకూ ఇక్కడే కూర్చుంటానని పట్టాభి రోడ్డుపైనే బైఠాయించారు.

  పోలీసుల నిర్లక్ష్యం వల్లే తనపై ఇన్నిసార్లు దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికైనా పోలీసులు నిజాయతీగా విచారణ చేయాలని పట్టాభి డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. వార్తా ఛానళ్లు నిర్వహించే చర్చల్లో పట్టాభి చురుగ్గా పాల్గొనేవారు. తన వాదనను బలంగా వినిపించేవారు.
  Published by:Sambasiva Reddy
  First published: