Home /News /politics /

TDP SERVES WHIP TO KARANAM BALARAM VALLABHANENI VAMSI MADDALI GIRI FOR RAJYA SABHA ELECTIONS AK

టీడీపీ వ్యూహం... ఆ ఎమ్మెల్యేలకు ఇరకాటం

అప్పట్లో ఎంపీలు పార్లమెంట్‌లో చేసిన పోరాటాన్ని స్పూర్తిగా తీసుకోవాలని ఆయన పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. అయితే అమరావతి విషయంలో చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేసేందుకు టీడీపీ నేతలు అంత సుముఖంగా లేరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

అప్పట్లో ఎంపీలు పార్లమెంట్‌లో చేసిన పోరాటాన్ని స్పూర్తిగా తీసుకోవాలని ఆయన పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. అయితే అమరావతి విషయంలో చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేసేందుకు టీడీపీ నేతలు అంత సుముఖంగా లేరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

వర్ల రామయ్యను టీడీపీ బరిలోకి దింపడం వెనుక అసలు వ్యూహం... పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకునపెట్టడమే అనే టాక్ వినిపిస్తోంది.

    ఎల్లుండి జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో సరైన బలం లేకపోయినా టీడీపీ బరిలోకి దిగింది. తమ పార్టీ తరపున వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఆయన గెలుపు సాధ్యంకాదనే విషయం తెలిసినా... టీడీపీ మాత్రం తమ నిరసన తెలియజేసేందుకే అభ్యర్థిని పోటీకి పెట్టినట్టు తెలిపింది. అయితే వర్ల రామయ్యను బరిలోకి దింపడం వెనుక అసలు వ్యూహం... పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకునపెట్టడమే అనే టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు ఓటు వేయాలని కోరుతూ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం. జగన్‌కు జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి వంటి వారికి టీడీపీ విప్ జారీ చేసింది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం దక్కుతుందని ఆ పార్టీ భావిస్తోంది. మరి.. జగన్‌కు జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు... సొంత పార్టీ ఇచ్చి విప్ విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Tdp, Varla ramaiah

    తదుపరి వార్తలు