సీఎం జగన్ నిర్ణయానికి టీడీపీ సీనియర్ నేత మద్దతు...

కరోనా వైరస్ దెబ్బకు ఓ వైపు ప్రపంచమంతా వణికిపోతుంటే, ఏపీ సీఎం జగన్ మాత్రం దీనికి పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని యనమల విమర్శించారు.

news18-telugu
Updated: April 2, 2020, 8:24 AM IST
సీఎం జగన్ నిర్ణయానికి టీడీపీ సీనియర్ నేత మద్దతు...
యనమల రామకృష్ణుడు, సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:

కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారడంతో... ఉద్యోగుల జీతాల్లో ఏపీ ప్రభుత్వం కోత విధించింది. అయితే ఈ అంశంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆర్థిక కష్టాలను అర్థం చేసుకుని ఉద్యోగులు సహకరించాలని సూచించారు. అయితే కరోనా వైరస్ దెబ్బకు ఓ వైపు ప్రపంచమంతా వణికిపోతుంటే, ఏపీ సీఎం జగన్ మాత్రం దీనికి పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని యనమల విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై జగన్‌కు ఎంత శ్రద్ధ ఉందన్న విషయానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఆరోపించారు.

సీఎం జగన్ ఏదో మొక్కుబడిగా మీడియా సమావేశం నిర్వహించారని యనమల విమర్శించారు. రాష్ట్ర ఆదాయం మందగిస్తోందని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి... దీని నుంచి బయటపడేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టబోతున్నారో చెప్పలేదని అన్నారు. ఈ విషయంలో నిపుణుల సలహాలు కూడా సీఎం జగన్ తీసుకోలేదని మాజీమంత్రి యనమల విమర్శించారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలను చైతన్య పరిచేలా జగన్‌ మాట్లాడలేదన్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని యనమల ఆరోపించారు.



First published: April 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading