పోలీసులకు జై కొట్టిన ఏపీ టీడీపీ నేత

ఏపీ పోలీసుల తీరుపై కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య... తాజాగా వారిపై ఆసక్తికర ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: October 21, 2019, 1:32 PM IST
పోలీసులకు జై కొట్టిన ఏపీ టీడీపీ నేత
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 21, 2019, 1:32 PM IST
ఈ మధ్యకాలంలో ఏపీలో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య కాస్త అగాధం ఏర్పడిన సంగతి తెలిసిందే. టీడీపీ శ్రేణులు, నేతల పట్ల పోలీసులు దురుసగా వ్యహరిస్తున్నారని... అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కొంతకాలంగా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పోలీసుల తీరుపై పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యపై పోలీసు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో టీడీపీ నేత వర్ల రామయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నాడు టీడీపీ నేత వర్ల రామయ్య ఆసక్తికర ట్వీట్ చేశారు.

గతంలో తాను పోలీసు అధికారిగా పనిచేసిన రోజులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. పోలీసుల త్యాగం, దీక్షా, దక్షతలు అజరామరం, బహుదా ప్రశంసనీయమని కొనియాడారు. వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి అవిశ్రాంతంగా పౌర సేవలందిస్తున్న పోలీసుల పట్ల అందరూ సానుకులంగా ఉండాల్సిందే అని అభిప్రాయపడ్డారు. 26 సంవత్సరాలు పోలీసు అధికారిగా పనిచేసే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నాను. పోలీసులకు జేజేలు పలుకుతున్నానంటూ అని వర్ల రామయ్య ట్విట్టర్‌లో వెల్లడించారు.First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...