విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత తీవ్ర ఆరోపణలు

విజయసాయిరెడ్డి

ఫ్యాక్టరీ తెరవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రమాదానికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

  • Share this:
    విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదానికి కారకులైన యాజమాన్యాన్ని తక్షణం అరెస్ట్ చేయాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ తెరవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రమాదానికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పర్యావరణ ప్రభావ అంచనా (EIA) సర్టిఫికెట్ లేకుండా కంపెనీని ఎలా ప్రారంభించారని వర్ల రామయ్య ప్రశ్నించారు. పాలిమర్స్ యాజమాన్యం నుంచి విజయసాయిరెడ్డి ట్రస్ట్ బలవంతంగా ఎంత డబ్బు వసూలు వేసిందో బయటపెట్టాలని అన్నారు. ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యంపై ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రేమ వ్యక్తం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

    ఎల్‌జీ పాలిమర్స్ ప్రాంతమంతా ఫైర్ ఇంజన్లతో 24గంటలూ నీళ్ళు జల్లాలన్న టీడీపీ సూచనలను ఎందుకు పాటించలేదని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఇంతటి దుర్ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యంపై ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా వ్యవహరించడం తగదని ఆయన సూచించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: