• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TDP SENIOR LEADER TRY TO TAKE HIS LIFE AFTER YCP FOLLOWERS NOT FOLLOWING DEAL HSN

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ సీన్.. వైసీపీతో బెడిసికొట్టిన డీల్.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ సీన్.. వైసీపీతో బెడిసికొట్టిన డీల్.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

ఆత్మహత్యాయత్నం చేసిన టీడీపీ నేతను పరామర్శిస్తున్న ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

కృష్టా జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ మధ్య గతంలో జరిగిన ఓ ఒప్పందం, చివరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని ఆత్మహత్యాయత్నం చేసుకునేలా చేశాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే..

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ సెగలను పుట్టిస్తోంది. అధికార వైసీపీ, ఎస్ఈసీ మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుప్రీం తీర్పుతో ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవడంతో మొదటి విడత నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో జరుగుతున్న రాజకీయాల్లో వింత విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ చోట జనసేన, వైసీపీ అనుచరులు కలిసిపోగా, మరోచోట టీడీపీ, వైసీపీ మద్ధతుదారులు కూటమిగా ఏర్పడి, జనసేన-బీజేపీ అనుచరులపై పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్టా జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ మధ్య గతంలో జరిగిన ఓ ఒప్పందం, చివరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని ఆత్మహత్యాయత్నం చేసుకునేలా చేశాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే..

    స్థానిక సంస్థల ఎన్నికలకు గతేడాదే నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆ సమయంలో ఎన్నికలు వాయిదాపడ్డాయి. అయితే ఆ సమయంలో కృష్టా జిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగూడెం గ్రామంలో వైసీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య ఓ ఒప్పందం జరిగింది. లింగగూడెం సర్పంచి పదవిని టీడీపీకి ఇచ్చేలా, ఎంపీటీసీని వైసీపీకి ఇచ్చేలా ఇరు పార్టీల మద్దతుదారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే 15 లక్షల రూపాయల జరిమానా కూడా కట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఎన్నికలు కాస్తా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఈ పంచాయతీ ఎన్నికలను అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఆ ఒప్పందాన్ని వైసీపీ నేతలు పట్టించుకోవడం మానేశారు.

    తాజాగా, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఒప్పందం విషయాన్ని లింగగూడెం మాజీ సర్పంచి, టీడీపీ సీనియర్ నాయకుడు మురుకుట్ల రామారావు వైసీపీ నేతలకు గుర్తు చేశారు. ఒప్పందం ప్రకార టీడీపీ సభ్యులు మాత్రమే నామినేషన్ వేయాల్సి ఉందని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఒప్పందం రద్దయిపోయినట్టేననీ, వైసీపీ మద్దతుదారులు తప్పనిసరిగా పోటీలో ఉంటారని వాళ్లు తేల్చిచెప్పారు. దీంతో గ్రామ పెద్దల దృష్టికి ఒప్పందం విషయాన్ని తీసుకెళ్లినా , వైసీపీ నేతలు పట్టించుకోలేదు. దీంతో ఆయన ఈ శుక్రవారం తన పొలానికి వెళ్లి, తనే స్వయంగా పురుగుమందును ఓ ఇంజెక్షన్ ద్వారా తీసుకున్నారు.

    ఆ తర్వాత ఇంటికి వచ్చారు. ఇంట్లోనే కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్తే తాను పురుగుమందు తీసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి రామారావును ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు