ప్రధాని నరేంద్ర మోదీతో విభేదించి చంద్రబాబు తప్పుచేశారని ఆ పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ మోదీతో కలవాల్సిన అవసరం ఉందని, దానికోసం సీనియర్లమంతా కలిసి చంద్రబాబుకు సూచిస్తామని ఆయన వెల్లడించారు. త్వరలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కలుస్తాయని ఆయన జోస్యం చెప్పారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో మాట్లాడిన ఆయన.. రాజధాని అంశంపై స్పందించారు. రాజధాని పరిధిలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో ఆందోళన చేస్తున్న సంఘీభావం తెలుపూతూ.. రాజధాని రైతులు, ప్రజలెవరూ అధైర్యపడవద్దని అన్నారు.
మూడు రాజధానులు తగదని, కావాలంటే పులివెందులలో రాజధాని పెట్టుకోవాలని సీఎం జగన్కు హితవు పలికారు. అమరావతి రైతులు తమ పోరాటాన్ని ఆపొద్దని, శ్రుతిమించుతున్న పోలీసుల వైఖరిపై తిరగబడాలని రాయపాటి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap bjp, AP News, Bjp-tdp, Chandrababu naidu, Janasena, Rayapati, Tdp