వైసీపీకి షాక్.... జగన్ మతంపై టీడీపీ తీవ్ర విమర్శలు

సీఎం జగన్ బావ వైఎస్ హయాంలో రెండు ఎకరాలు కాజేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: November 17, 2019, 2:30 PM IST
వైసీపీకి షాక్.... జగన్ మతంపై టీడీపీ తీవ్ర విమర్శలు
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వల్లభనేని వంశీ వ్యాఖ్యలతో ఏపీలో వేడి రాజుకుంది. ఆ తర్వాత కొడాలి నాని తన మాటలతో వాటికి మరింత ఆజ్యం పోశారు. దీంతో తాజాగా సీఎం జగన్ ఫ్యామిలీపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత పట్టాభి. జగన్ కుటుంబం అసలైన క్రిస్టియన్లు కాదని విమర్శించారు. జగన్ ఫ్యామిలీకి అసలు బైబిల్ పుస్తకం పట్టుకొనే అర్హత కూడా లేదన్నారు. అంతేకాదు జెరూసలెం యాత్రకు కూడా వెళ్లే అర్హత లేదన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే మిమ్మల్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

బైబిల్‌లో ఎక్కడా ఇతర మతాల్ని అగౌరవపరచమని చెప్పలేదన్నారు. క్రిస్టియానిటీ పేరుతో కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. మీరు ఒక్క సేవా కార్యక్రమం అయినా చేశారా అంటూ ప్రశ్నించారు. క్రిస్టియన్ మతాన్ని ఉపయోగించి మత విద్వేషాలు రెచ్చగొట్టి బ్రొకరేజి చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. క్రిస్టియానిటీ ఒక మతం కాదు.. ఒక జీవన విధానమన్నారు. సీఎం జగన్ బావ వైఎస్ హయాంలో రెండు ఎకరాలు కాజేశారన్నారు. ఇతర మతాలపై దాడులు చేయమని ఎక్కడా ఉందా ? బలవంతపు మతమార్పిడిలు చేయాలని బైబిల్‌లో ఉందా ?అంటూ జగన్‌ను ప్రశ్నించారు పట్టాభి. కొడాలి నాని చాలా నీఛంగా మాట్లాడారు చంద్రబాబు, లోకేష్‌ను విమర్శించే స్థాయి ఏపీ మంత్రి కొడాలికి లేదన్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: November 17, 2019, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading