HOME »NEWS »POLITICS »tdp senior leader kala venkat rao letter to cm ys jagan mohan reddy on housing lands for poor ak

‘సూట్ కేసు కంపెనీ కుంభకోణంగా ఇళ్ల పట్టాల కార్యక్రమం’

‘సూట్ కేసు కంపెనీ కుంభకోణంగా ఇళ్ల పట్టాల కార్యక్రమం’
కళా వెంకట్రావు(ఫైల్ ఫోటో)

గడిచిన 15 నెలల పాలనలో ఒక్క ఇంటినీ నిర్మించలేకపోయారని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఆరోపించారు.

  • Share this:
    భూస్థలాల వేటలో వైసీపీ నేతలు రియల్ బ్రోకర్ల అవతారం ఎత్తి రైతులను దోచుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఏపీలో భూఅక్రమాలపై లెక్కలు చూపేందుకు సిద్ధమని ఆయన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నేతలకు దోచి పెట్టేందుకు ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని మరో సూట్ కేసు కంపెనీ కుంభకోణంగా మార్చారని విమర్శించారు. ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతిపై వైసీపీ నేతలే కోర్టులలో కేసులు వేస్తున్నారని ఆయన అన్నారు. బలవంతపు భూసేకరణ వల్ల నష్టపోయింది బడుగు, బలహీనవర్గాల ప్రజలే అని లేఖలో ప్రస్తావించారు.

    గడిచిన 15 నెలల పాలనలో ఒక్క ఇంటినీ నిర్మించలేకపోయారని ఆయన ఆరోపించారు. ఇంద్రుడు కూడా కుళ్లుకునేంత రాజప్రసాదాలను జిల్లాకొకటి నిర్మించుకుంటున్నారని.. కానీ పేదలకు మాత్రం స్మశానాలు, ముంపు ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకోమని అంటున్నారని విమర్శించారు. ఇలాంటి భూముల్లో వైసీపీ నేతలు ఇళ్లు కట్టుకుని ఉండగలరా అని కళా వెంకట్రావు ప్రశ్నించారు.

    Published by:Kishore Akkaladevi
    First published:September 03, 2020, 11:43 IST

    टॉप स्टोरीज