ఇసుక రీచ్‌లు... అవినీతి కేంద్రాలు... మాజీమంత్రి విమర్శలు

ఏపీ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ చూస్తుంటే నియోజకవర్గాల వారీగా ఇసుక మాఫియాను తయారుచేసినట్టుందని టీడీపీ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: November 18, 2019, 7:44 PM IST
ఇసుక రీచ్‌లు... అవినీతి కేంద్రాలు... మాజీమంత్రి విమర్శలు
కిమిడి కళా వెంకట్రావు ఫైల్ ఫోటో(Image:Facebok)
  • Share this:
ఏపీలోని అధికార పార్టీపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు మరోసారి విమర్శలు గుప్పించారు. నియోజకవర్గానికి ఒక రీచ్ ఏర్పాటు చేసి అవినీతికి తలుపులు తెరిచారని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ చూస్తుంటే నియోజకవర్గాల వారీగా ఇసుక మాఫియాను తయారుచేసినట్టుందని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానం భవన నిర్మాణ రంగానికి సహకరించేలా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక అంశంపై 5 నెలల తర్వాత తీరిగ్గా కళ్లు తెరిచిందంటూ వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు.

రాజాంలోని తునివాడ రీచ్ లో టన్ను ఇసుక ధర రూ.550గా పేర్కొన్నారని, గతంలో అక్కడ 4 టన్నుల ఇసుక రూ.1400కే లభ్యమయ్యేదని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీరాలంటే ఉచిత ఇసుక విధానం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఇసుక ధర సామాన్యులు కొనేలా ఉండాలని కళా వెంకట్రావు హితవు పలికారు.

First published: November 18, 2019, 7:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading