టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్
బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న జేసీ దివాకర్ రెడ్డిని మధ్యలోని అడ్డగించిన పోలీసులు... ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
news18-telugu
Updated: October 30, 2019, 11:41 AM IST

జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)
- News18 Telugu
- Last Updated: October 30, 2019, 11:41 AM IST
టీడీపీ మాజీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న జేసీ దివాకర్ రెడ్డిని మధ్యలోని అడ్డగించిన పోలీసులు... ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ నేత నాగరాజు ఇంటికి అడ్డంగా బండలు నాటారు. దీనిపై మూడు రోజులుగా ఆ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తమ పార్టీ నేత ఇంటికి అడ్డంగా పెట్టిన బండలు తొలగించేందుకు వెంకటాపురం బయలుదేరిన జేసీ దివాకర్ రెడ్డిని మార్గమధ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివాదానికి సంబంధించి బండలు నాటిని స్థల వివాదం కోర్టులో ఉందని పోలీసులు జేసీ దివాకర్ రెడ్డిని సర్ధిచెప్పారు. అయినా దీనిపై జేసీ దివాకర్ రెడ్డి వారి మాట వినకపోవడంతో... ఆయనకు అరెస్ట్ చేసి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్కు తరలించారు. మూడు రోజుల నుంచి తమ నాయకుడిని వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా... పోలీసులు పట్టించుకోవడం లేదని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు.
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్
వైసీపీ ఎమ్మెల్యే తల నరుకుతా.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
రేపు సీమలో కియ మోటర్స్ ప్లాంట్ ప్రారంభించనున్న జగన్
అనంతలో దారుణం... వాతలు పెట్టి భార్యపై స్నేహితుడితో అత్యాచారం
ఏపీలో తొలిసారి కియా కంపెనీకి సీఎం జగన్
భార్యాభర్తల గొడవ... సెటిల్ మెంట్ చేసిన పెద్దమనిషి దారుణ హత్య
Loading...