గొంతు క్యాన్సర్‌తో పోతావ్.. ఏపీ మంత్రికి టీడీపీ నేత వార్నింగ్

ప్రతీకాత్మక చిత్రం

Kodali Nani Vs Devineni Uma: లారీలతో గుద్దిస్తానన్న కొడాలి నాని బెదిరింపులపై డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

 • Share this:
  Devineni Uma Comments: ఏపీ మంత్రి కొడాలి నాని, మాజీమంత్రి దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దేవినేని ఉమ జీవితం ఎలాంటిదో అందరికీ తెలుసుని.. ఆయన తండ్రి ఏం చేసేవారో కూడా ప్రజలకు తెలుసని కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాజీమంత్రి దేవినేని ఉమ.. ఆయన ఏ మాత్రం చదువు సంస్కారం లేకుండా మాట్లాడారని విమర్శించారు. చంద్రబాబు వయస్సు గురించి తమ చావులు గురించి మాట్లాడితే చేసిన తప్పులు కనపడకుండా పోతాయాని భావిస్తున్నారని విమర్శించారు. వారి అసమర్థతను, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చిల్లర రాజకీయాలు, గల్లీ రాజకీయాలు చేస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.

  Kodali Nani Vs Devineni Uma, kodali nani comments, devineni uma comments on kodali nani, tdp news, ysrcp news, కొడాలి నాని, దేవినేని ఉమ, టీడీపీ న్యూస్, వైసీపీ న్యూస్
  దేవినేని ఉమ, కొడాలి నాని


  రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై హీనంగా మాట్లాడినందుకు గొంతు క్యాన్సర్‌తో పోతావ్ అంటూ కొడాలి నానిని హెచ్చరించారు. లారీలతో గుద్దిస్తానన్న కొడాలి బెదిరింపులపై డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సంపద సృష్టి చేతకాక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లలేక తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: