చంద్రబాబుపై టీడీపీ సీనియర్ నేత పరోక్ష విమర్శలు... ఏమన్నారంటే...

టీడీపీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: June 21, 2019, 1:42 PM IST
చంద్రబాబుపై టీడీపీ సీనియర్ నేత పరోక్ష విమర్శలు... ఏమన్నారంటే...
చంద్రబాబు (File)
news18-telugu
Updated: June 21, 2019, 1:42 PM IST
రాజకీయంగా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్న టీడీపీ భవిష్యత్తు ఏంటనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నలుగురు బీజేపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోవడం... ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తుండటం టీడీపీ వర్గాలను టెన్షన్ పెడుతోంది. అయితే టీడీపీకి ఇలాంటి సంక్షోభాలు కొత్తకాదని... అధైర్యపడొద్దని చంద్రబాబు పార్టీ శ్రేణులకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది కాబట్టే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి నూతన నాయకత్వాన్ని తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని అబిప్రాయపడ్డారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై అశోక్ గజపతిరాజు తనదైన శైలిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రజంటేషన్ కూడా ముఖ్యమేనని అన్నారు. అయితే ఈ రెండింటి మధ్య గ్యాప్ వచ్చిందని, అందువల్లే టీడీపీ ఓడిపోయిందని విశ్లేషించారు.

అయితే ఇప్పటికీ టీడీపీ బలంగానే ఉందన్న అశోక్ గజపతిరాజు... తప్పులు తెలుసుకుని పార్టీని బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టి సారించాలని సూచించారు. అలా కాకుండా ఇంకా ఏదో భ్రమలో ఉండిపోతే నాయకత్వం నిలబడదు పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై కూడా అశోక్ గజపతిరాజు విమర్శలు గుప్పించారు.First published: June 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...