ఏపీ మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే మూడేళ్లలోనే ఎన్నికలు రాబోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులను ఇబ్బందిపెట్టే విధంగా వ్యవహరించొద్దని ఆయన పోలీసులను హెచ్చరించారు. మీరు మళ్లీ మా దగ్గరే పని చేయాలని మాజీమంత్రి కామెంట్ చేయడం గమనార్హం. తన పుట్టినరోజు సందర్భంగా బైక్ ర్యాలీ తీసేందుకు సిద్ధమైన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యన్నపాత్రుడు... ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.
హెల్మెట్లు లేకుంటే ర్యాలీకి అనుమతి లేదనడంపై ఆయన మండిపడ్డారు. తప్పు పోలీసులది కాదని... సీఎం జగన్ నుంచే వారిపై ఒత్తిడి ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటి పద్ధతి ఉందా ? అని ప్రశ్నించారు. అంతకుముందు నర్సీపట్నంపై కొద్దిసేపు హైడ్రామా చోటు చేసుకుంది. హెల్మెంట్లు లేకుండా బైక్ ర్యాలీ తీస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేయడంతో... ఇందుకు నిరసనగా బైక్లను తోసుకుంటూ వెళ్లారు టీడీపీ కార్యకర్తలు. ర్యాలీ ముందు ఓపెన్ టాప్ జీపులో నారా లోకేశ్ వెళ్లారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.