వైసీపీకి టీడీపీ కౌంటర్...అమరావతిపై సరికొత్త వీడియో

అమరావతి గ్రాఫిక్స్ కాదని... ఇదే నిజమైన అమరావతి అంటూ టీడీపీ ఓ వీడియోను విడుదల చేసింది.

news18-telugu
Updated: November 29, 2019, 3:38 PM IST
వైసీపీకి టీడీపీ కౌంటర్...అమరావతిపై సరికొత్త వీడియో
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమరావతి విషయంలో చంద్రబాబు ఏమీ చేయలేదని... ప్రజలను భ్రమల్లో విహరింపజేశారని టీడీపీని ఏపీలో అధికార వైసీపీ టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా వైసీపీ మరోసారి ఇదే రకమైన విమర్శలు చేసింది. అమరావతిలో ఏం ఉందని చంద్రబాబు చూడటానికి వస్తున్నారని వైసీపీ నేతలు, ఏపీ మంత్రులు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిని చంద్రబాబు ఎంతో గొప్పగా చెబుతున్నారని... కానీ వాస్తవానికి అమరావతి నిర్మాణం విషయంలో ఆయన చేసిందేమీ లేదని వైసీపీ ఆరోపించింది.

దీనిపై టీడీపీ వీడియో రిలీజ్ చేస్తూ వైసీపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో తలపెట్టిన నిర్మాణాలకు సంబంధించిన వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. అమరావతి గ్రాఫిక్స్ కాదని... ఇదే నిజమైన అమరావతి అంటూ వీడియోను విడుదల చేసింది.


First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>