సీఎం జగన్ వంద రోజుల పాలనపై.... టీడీపీ బ్రోచర్ విడుదల

జగన్ గారి పాలన వంద శాతం విరక్తి పుట్టించిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. వైసీపీ 100 రోజుల పాలనలో 125 తప్పులు అంటూ టీడీపీ ఓ బ్రోచర్ విడుదల చేసింది.

news18-telugu
Updated: September 7, 2019, 4:19 PM IST
సీఎం జగన్ వంద రోజుల పాలనపై.... టీడీపీ బ్రోచర్ విడుదల
జగన్ గారి పాలన వంద శాతం విరక్తి పుట్టించిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. వైసీపీ 100 రోజుల పాలనలో 125 తప్పులు అంటూ టీడీపీ ఓ బ్రోచర్ విడుదల చేసింది.
news18-telugu
Updated: September 7, 2019, 4:19 PM IST
జగన్ వందరోజుల పాలనపై 100 రోజుల్లో... 100 వైఫల్యాలు అంటూ తెలుగుదేశం పార్టీ బ్రోచర్ విడుదల చేసింది. జగన్ గారి పాలన వంద శాతం విరక్తి పుట్టించిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. వైసీపీ 100 రోజుల పాలనలో 125 తప్పులు అంటూ టీడీపీ ఓ బ్రోచర్ విడుదల చేసింది. గుంటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ సీనియర్లు 4 పేజీల బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. వంద రోజుల్లో ఇంత దారుణంగా ప్రవర్తించిన సీఎం జగన్ తప్పా ఎవరూ లేరన్నారు మాజీ ఆర్థిక మంత్రి యనమల. రాష్ట్ర ఆదాయం తగ్గి తెలంగాణ ఆదాయం పెరిగిందన్నారు. పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. తాజాగా విడుదల చేస్తోంది మొదటి చార్జిషీట్ మాత్రమే అన్నారు యనమల. త్వరలో మరొకటి కూడా విడుదల చేస్తామన్నారు.First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...