జగన్ 6 నెలల పాలనపై పుస్తకం విడుదల

మంచి సీఎం కాదు.. జనాన్ని ముంచే సీఎం' పేరుతో బుక్‌ రిలీజ్‌ చేశారు.

news18-telugu
Updated: November 30, 2019, 2:46 PM IST
జగన్ 6 నెలల పాలనపై  పుస్తకం విడుదల
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఇవాల్టీతో ఏపీ సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు పూర్తయ్యింది. ఓవైపు జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలపై సోషల్ మీడియాలో వైసీపీనేతలు ఊదరగొట్టెస్తుంటే.. మరోవైపు జగన్ 6నెలల పాలనపై టీడీపీ విమర్శల దాడి చేస్తోంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ట్వీట్లు చేస్తే జగన్ ఆరునెలల పాలనపై విమర్జవల వర్షం కురిపిపంచారు. దీనిపై టీడీపీ ఓ పుస్తకం కూడా విడుదల చేసింది. 'మంచి సీఎం కాదు.. జనాన్ని ముంచే సీఎం' పేరుతో బుక్‌ రిలీజ్‌ చేశారు. ప్రజలు ఒక్కచాన్స్‌ ఇస్తే మోసం చేశారని విమర్శించారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఆరు నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. ''మాట తప్పారు..మడమ తిప్పారు'. ఇచ్చిన పథకాల కంటే రద్దు చేసిన పథకాలే ఎక్కువంటూ విమర్శించారు. ప్పటికే 62వేల కోట్లు అప్పు చేశారు. ఉద్యోగుల జీతభత్యాలు కూడా చెల్లించలేని స్థితికి తెచ్చారంటూ యనమాల ఆరోపణలు చేశారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్‌..అవినీతిని అరికడతారా? అంటూ ప్రశ్నించారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి రాజధానిలో నిర్మాణాలు పూర్తి చేసేవాళ్లమన్నారు యనమల.First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>