హోమ్ /వార్తలు /రాజకీయం /

చంద్రబాబును ఊహించని దెబ్బ కొట్టిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు...

చంద్రబాబును ఊహించని దెబ్బ కొట్టిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు...

నల్లచొక్కాలో చంద్రబాబు

నల్లచొక్కాలో చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఊహించని విధంగా దెబ్బకొట్టారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఊహించని విధంగా దెబ్బకొట్టారు. రాజ్యసభ ఎన్నికల ద్వారా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టే అవకాశం వస్తుందని ఊహించిన పార్టీ పెద్దలకు వాళ్లు అంతకంటే ఊహించని షాక్ ఇచ్చారు. ఈరోజు ఏపీలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు. వాస్తవానికి ఓ ఎంపీ గెలవడానికి కనీసం 36 ఓట్లు అవసరం. టీడీపీకి ఉన్నది కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఓడిపోతామని తెలిసినా కూడా టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆ రకంగా టీడీపీకి దూరంగా ఉంటూ, వైసీపీకి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలకు ముక్కుతాడు వేయవచ్చని భావించింది. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ సభ్యులు వైసీపీకి ఓటు వేస్తే వారిపై విప్ ధిక్కరించారంటూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. పార్టీ విప్ ధిక్కరించిన వారిని ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయించే అవకాశం వచ్చేది.

టీడీపీ ఒక రకంగా ఊహిస్తే వైసీపీ, రెబల్ ఎమ్మెల్యేలు మరో ఎత్తు వేశారు. కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి ముగ్గురూ చివరి నిమిషంలో తమ ఓటు వేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు అనారోగ్యం కారణంగా ఓటు వేయలేదు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఇటీవల కోవిడ్ 19 పేషెంట్‌ను కలిశానని, ఆ కారణంగా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్పారు. టీడీపీకి మొత్తం 21 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో నాలుగు ఓట్లు (రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురు, మరో టీడీపీ ఎమ్మెల్యే) చెల్లకుండా పోయాయి. ఒకటో ప్రాధాన్యం కింద 1 నెంబర్ వేయాల్సిన చోట ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టిక్ పెట్టినట్టు తెలుస్తోంది. రాజమండ్రికి చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తప్పుగా ఓటు వేశారు. ఆమె బ్యాలెట్ పేపర్ మీద రాసినట్టు సమాచారం. దీంతో ఆ నాలుగు ఓట్లు చెల్లకుండా పోయాయి.

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురూ తమ పదవికి ఢోకా లేకుండా, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే చెల్లకుండా ఓటు వేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆదిరెడ్డి భవానీ ఓటు కూడా చెల్లకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మాక్ పోలింగ్ నిర్వహించి ఓటు ఎలా వేయాలో కూడా చెప్పలేదా అంటూ పార్టీ నేతల మీద సీరియస్ అయినట్టు సమాచారం.

First published:

Tags: Andhra Pradesh, Chandrababu naidu, Karanam balaram, Tdp, Vallabhaneni vamsi

ఉత్తమ కథలు