టీడీపీకి రెబల్ మారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్... ఏపీ రాజకీయాల్లో వాడివేడి రచ్చ రేపింది. అయితే టీడీపీకి గుడ్ బై చెప్పిన వంశీ... అటు వైసీపీలోకాని బీజేపీలో కాని చేరలేదు. ఆ రెండు పార్టీల పెద్దల్ని కలిశారే తప్ప ఏ పార్టీ కండువా కప్పుకోలేదు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో మరోసారి వంశీ టాపిక్ తెరపైకి వచ్చింది. సభలో వంశీ ఎక్కడ కూర్చుంటారన్న దానిపై అప్పట్లోనే వాడివేడిగా చర్చ సాగింది. ఆయన టీడీపీ బెంచ్ ల్లో కూర్చొనే అవకాశం లేదని... అందుకు వంశీ సైతం సిద్దంగా లేరని వార్తలు వినిపించాయి. దీంతో ఆయన ఎక్కడ కూర్చుంటారోనన్న అంశం ఆసక్తి రేకిత్తించింది. అయితే వంశీ మాత్రం అసెంబ్లీలో టీడీపీ గ్రూపులనే కూర్చున్నారు. అయితే టీడీపీ సభ్యులకు కాస్త దూరంగా వంశీ కూర్చున్నట్లు సమాచారం.
అసెంబ్లీలో అయోమయంగా ఉన్నవంశీని టీడీపీఎల్పీ కార్యాలయంంలోకి టీడీపీ ఎమ్మెల్యేలు ఆహ్వానించారు. అయితే అందుకు వంశీ సున్నితంగా తిరస్కరించారు. విప్ చెవిరెడ్డి కూడా వంశీని కూడా ఆహ్వానించినట్లు సమాచారంజ అయితే ఆయన అటు వైసీపీలో కూడా అధికారికంగా చేరలేదు. ఒకవేళ చేరినా కూడా పదవికి రాజీనామా చేసి రావాలని ఇప్పటికే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సైతం స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక వంశీ సభలో టీడీపీ గ్రూప్‌లోనే కూర్చున్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.