ఇటీవల టీడీపీకి రరాజీనామా చేసి పార్టీ నుంచి బయటకొచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో వంశీ సమావేశమయ్యారు. మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన జగన్‌ను కలిశారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన వంశీ.. అప్పట్లోనే ఇక జగన్ వెంట కలిసి నడుస్తానని చెప్పాడు. టీడీపీ నుంచి బయటకు రాగానే... చంద్రబాబు, లోకేష్‌లో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అంతేకాదు వంశీపై విమర్శలు గుప్పించిన టీడీపీ నేతల్ని సైతం మీడియా ముందే... నానా మాటలు అన్నారు. దీంతో వంశీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారాయి.
ఆ తర్వాత కాస్త సైలెంట్ అయిన.. వంశీ మంగళవారం అకస్మాత్తుగా సీఎం జగన్‌తో సమావేశమవ్వడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించనని... ఎవరైనా వస్తే... వారు పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని జగన్ ముందు నుంచే కండిషన్లు పెట్టారు. మరి ఇప్పుడు వంశీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానిస్తారా ? లేక వంశీ విషయంలో మినహాయింపు ఇస్తారా ? అనేది వేచి చూడాల్సిందే.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.