లఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో వంశీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం జగన్‌ను కలవడంపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. దీంతో వంశీ సమాధానం ఇస్తూ చంద్రబాబు గారు నేను సీఎంను కలిస్తే మీకు ఉలుకెందుకు? అంటూ ప్రశ్నించారు. మాకు హక్కులుండవా అంటూ చంద్రబాబును నిలదీశారు. సీఎం జగన్‌ను కలవడంపై వంశీ వివరణ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశానన్నారు. వంశీ మాట్లాడుతుంటే... టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను ఆయన కలవడం ఇదే మొదటిసారి ఏం కాదన్నారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ పై కూడా పరోక్షంగా సెటైర్లు వేశారు వల్లభనేని వంశీ. పప్పు అండ్ బ్యాచ్ అంటూ విమర్శలు గుప్పించారు. జయంతికి వర్థంతికి తేడా తెలియన వాళ్లు టీడీపీలో ఉన్నారన్నారు.నేను మాట్లాడుతుంటే సభ నుంచి చంద్రబాబు ఎందుకు లేచి వెళ్లిపోయారంటూ ప్రశ్నించారు. నాతో మాట్లాడకుండా నన్ను సస్పెండ్ చేశారు. అలాంటి పార్టీతో ఇక నేను కొనసాగలేను అంటూ స్పీకర్‌కు విన్నవించారు వంశీ. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని కోరుకుంటున్నానంటూ స్పీకర్‌కు రిక్వెస్ట్ చేసుకున్నారాయన.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.