ఏపీ డీజీపీపై కేంద్ర హోంసెక్రటరీకి ఫిర్యాదు ?

చంద్రబాబు కాన్వాయ్ వద్ద నిరసనలకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దాడి ఘటనలో డీజీపీ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

news18-telugu
Updated: November 30, 2019, 11:28 AM IST
ఏపీ డీజీపీపై కేంద్ర హోంసెక్రటరీకి ఫిర్యాదు ?
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. రాజధాని పర్యటన, బస్సుపై దాడి, డీజీపీ వ్యాఖ్యలపై చర్చించారు.డీజీపీ వ్యాఖ్యలపై కేంద్రహోమ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు టీడీపీ నేతలు. మరోవైపు పార్లిమెంట్లో... బస్సుపై దాడి అంశాన్ని ప్రస్తావించాలని ఎంపీలకు బాబు సూచించారు. దాడిపై తుళ్లూరు పీఎస్‍లో ఫిర్యాదు చేశారు. వచ్చేనెల 5న రాజధాని నిర్మాణంపై విజయవాడలో రౌండ్‍టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.ఈ భేటీకి రాజకీయ పార్టీలు, నిపుణులు, ఉద్యోగ, ప్రజాసంఘాలు హాజరుకానున్నాయి. రాజధానిపై గత ప్రభుత్వ నిర్ణయాలు, నేటి ప్రభుత్వ ఆలోచనలపై చర్చించనున్నారు. మొన్నటి ఘటనపై తుళ్లూరు పీఎస్‍లో ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు.చెప్పులు, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద నిరసనలకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దాడి ఘటనలో డీజీపీ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రెండు రోజుల క్రితం చంద్రబాబు రాజధాని పర్యటనలో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అమరావతిలో నిర్మాణాలను పరిశీలించేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రాజధాని పర్యటనకు వెళ్లారు. రాజధాని రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగారు. వారికి తోడుగా గో బ్యాక్ చంద్రబాబు అంటూ వైసీపీ వర్గీయులు నినాదాలు చేపట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ వర్గీయులను హెచ్చరించారు. కాగా, కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడికి దిగారు. ఇంకొందరు రాళ్లు కూడా రువ్వారు.

First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>