హోమ్ /వార్తలు /రాజకీయం /

తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం... రాహుల్‌తో డీల్ కుదిరిందా ?

తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం... రాహుల్‌తో డీల్ కుదిరిందా ?

ధర్మపోరాట దీక్షలో రాహుల్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)

ధర్మపోరాట దీక్షలో రాహుల్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెద్దగా సీట్లు సాధించకపోయినా... అక్కడక్కడ టీడీపీకి ఓటు బ్యాంకు మాత్రం ఉంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఓట్లు అన్ని కాంగ్రెస్‌కు పడేలా వ్యూహాలు రచిస్తున్నారు టీడీపీ నేతలు.

  తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంది తెలుగుదేశం పార్టీ. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేది లేదని నిర్ణయించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని డిసైడ్ అయ్యింది. తెలంగాణలో ఈసారి టీడీపీ పోటీ ఉంటుందా లేదా అన్న వార్తలకు చెక్ పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీజేఎస్‌తో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ... లోక్ సభ ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరమయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెద్దగా సీట్లు సాధించకపోయినా... అక్కడక్కడ టీడీపీకి ఓటు బ్యాంకు మాత్రం ఉంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఓట్లు అన్ని కాంగ్రెస్‌కు పడేలా వ్యూహాలు రచిస్తున్నారు టీడీపీ నేతలు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చి ఆ పార్టీని గెలిపించాలని అనుకుంటున్నారు.


  మరోవైపు ఇదే సమయంలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండటం కూడా తెలంగాణలో టీడీపీ ఎన్నికల్లో పోటీకి దూరం అవ్వడానికి కారణంగా తెలుస్తోంది. అక్కడ జరిగే ఎన్నికలపై ఫోకస్ పెడుతున్న చంద్రబాబు..తెలంగాణపై దృష్టి పెట్టడం కష్టంగా మారింది. దీంతో చంద్రబాబు ఇలాంటి సమయంలో తెలంగాణను కాస్త పక్కన పెట్టి పూర్తిస్థాయిగా ఏపీ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు.


  మరోవైపు జాతీయ రాజికీయాల్లో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారు. గతంలో రాహుల్‌తో అనేకసార్లు భేటీ అయ్యారు.  ఒకవేళ కేంద్రంలో రాహుల్ అధ్యక్షతన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కూడా ఆపార్టీతో స్నేహపూర్వక వైఖరి ఉండేలా.. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. అనేకమంది తెలంగాణ టీడీపీ నేతలు.. ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని చూసినా... చంద్రబాబు ఎవరికి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో టీ టీడీపీ పోటీకి చంద్రబాబు అనుమతి ఇవ్వరని చాలామంది అప్పుడే సందేహాలు వ్యక్తంచేశారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న చంద్రబాబు... తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని టీ టీడీపీ నేతలకు సూచిస్తున్నారు.


  ఇవి కూడా చదవండి:


  ఏనుగుతో సెల్ఫీ దిగాలని చూశాడు... అది ఏం చేసిందో తెలుసా


  SBI Schemes: ఎస్‌బీఐలో డిపాజిట్ స్కీమ్స్... ఎక్కువ వడ్డీ ఇలా పొందొచ్చు

  First published:

  Tags: Chandrababu naidu, Telangana, Telangana News, TS Congress, TTDP

  ఉత్తమ కథలు