Home /News /politics /

TDP PULIVENDULA CANDIDATE SATISH REDDY ON YS VIVEKANANDA MURDER MS

తప్పు మాలో ఉంటే నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చేయండి : వైఎస్ వివేకా హత్యపై సతీశ్ రెడ్డి

విజయసాయి రెడ్డి, సతీశ్ రెడ్డి(Image : Facebook)

విజయసాయి రెడ్డి, సతీశ్ రెడ్డి(Image : Facebook)

YS Vivekananda Murder : వినాశకాలం వచ్చింది కాబట్టే వైసీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సతీశ్ రెడ్డి విమర్శించారు. హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉందన్నది బయటపడుతుందని.. ఎదుట వ్యక్తిపై ఆరోపణలు చేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలని అన్నారు. పనికిరాని ఆరోపణలవల్ల పులివెందుల ప్రజల చేతిలో వైసీపీకి తీవ్ర పరాభవం జరుగుతుందని సతీష్ రెడ్డి హెచ్చరించారు.

ఇంకా చదవండి ...
    ఎన్నికలకు గడువు దగ్గరపడ్డ సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య గావించబడటం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. హత్యపై అప్పుడే ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలకు దిగాయి. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, ఆది నారాయణ రెడ్డి డైరెక్షన్‌లోనే హత్య జరిగిందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. మరోవైపు ఎన్నికలవేళ సానుభూతి కోసం ప్రశాంత్ కిశోరే హత్య చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. హత్య పులివెందులలోనే జరగడంతో స్థానిక టీడీపీ నేతలపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీశ్ రెడ్డి విజయసాయి రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.

    హత్యలు చేసే అలవాటు ఎవరికి ఉందో పులివెందులలో చిన్న బిడ్డ నుంచి కాటికి కాళ్లుచాచిన ముసలివాళ్ల వరకు ఎవరిని అడిగినా చెబుతారని పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్, అదినారాయణరెడ్డి సహా తనపై చేసిన ఆరోపణలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. వివేకానంద రెడ్డి హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు మాలో ఉంటే.. ఒకవేళ ఒక్క శాతం తప్పు చేసినట్లు రుజువైనా తనను నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చాలని సతీష్ రెడ్డి అన్నారు.


    వైసీపీ నేతలు ఏది చెబితే అది వినడానికి ఇక్కడి ప్రజలేమి పిచ్చివారు కాదని సతీశ్ రెడ్డి మండిపడ్డారు.వినాశకాలం వచ్చింది కాబట్టే వైసీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉందన్నది బయటపడుతుందని.. ఎదుట వ్యక్తిపై ఆరోపణలు చేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలని అన్నారు. పనికిరాని ఆరోపణలవల్ల పులివెందుల ప్రజల చేతిలో వైసీపీకి తీవ్ర పరాభవం జరుగుతుందని సతీష్ రెడ్డి హెచ్చరించారు.

    ఇది కూడా చదవండి : 'వివేకానంద హత్య వెనక మంత్రి హస్తం'...సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Chandrababu naidu, Nara Lokesh, Ys jagan, YS Vivekananda reddy, Ysrcp

    తదుపరి వార్తలు