హోమ్ /వార్తలు /National రాజకీయం /

Chandrababu-AP Bandh: ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు.. రాష్ట్రపతి పాలనకు చంద్రబాబు డిమాండ్

Chandrababu-AP Bandh: ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు.. రాష్ట్రపతి పాలనకు చంద్రబాబు డిమాండ్

చంద్రబాబునాయుడు (ఫైల్)

చంద్రబాబునాయుడు (ఫైల్)

Chandrababu Naidu: పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడి జరిగిందని.. ఒకేసారి రాష్ట్రంలో వివిధ చోట్ల దాడులు చేశారని అన్నారు. రాష్ట్రంలోని పార్టీ కార్యాలయలపై దాడులు ఎప్పుడూ జరగలేదని చంద్రబాబు గుర్తు చేశారు.

  వైసీపీ సృష్టించిన విధ్వంసానికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ నిర్వహిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఆ బంద్‌కు సహకరించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొనాలని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫెయిల్‌ అయ్యాయని విమర్శించారు. టీడీపీ నేత పట్టాభి ఇంటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు టీడీపీ (TDP) కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రౌడీయిజం చేస్తే బెదిరిపోతామని అనుకోవద్దని హెచ్చరించారు. తమకు మాట్లాడే స్వేచ్ఛ లేదా ? అని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan), డీజీపీ కుమ్మక్కై ఈ దాడి చేయించారని చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. తాను ఫోన్ చేస్తే డీజీపీ ఎందుకు ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్, కేంద్ర మంత్రులు ఫోన్లు ఎత్తి మాట్లాడుతున్నారని.. వారికంటే డీజీపీ బిజీనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  తాను ఎఫ్పుడూ రాష్ట్రపతి పాలనను సపోర్ట్ చేయలేదన్న చంద్రబాబు.. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన పెడితే తప్పేంటని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షిస్తారనేదే ప్రధాన సమస్యగా మారిందని అన్నారు. అందుకే తాను కేంద్ర మంత్రికి ఫోన్ చేశానని తెలిపారు. తాను ఎవరిని కూడా ఇంతవరకు బూతులు తిట్టలేదని చంద్రబాబు అన్నారు. అసలు బూతులు ముందుగా ఎవరు మొదలుపెట్టారని ప్రశ్నించారు.

  తమ నేతలను ఎన్ని బూతులు తిట్టినా సహించామని అన్నారు. మా పార్టీ కార్యాలయంపై దాడి చేయడం ఏంటని మండిపడ్డారు. ఈ దాడిలో గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. తాను 40 ఏళ్ల పాటు రాజకీయాలు చూశానన్న చంద్రబాబు.. ఇది మూమ్మాటికీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారని మండిపడ్డారు.

  Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

  Avoid Diabetes: డయాబెటిస్ రావొద్దని కోరుకుంటున్నారా ? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..

  పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడి జరిగిందని.. ఒకేసారి రాష్ట్రంలో వివిధ చోట్ల దాడులు చేశారని అన్నారు. రాష్ట్రంలోని పార్టీ కార్యాలయలపై దాడులు ఎప్పుడూ జరగలేదని చంద్రబాబు గుర్తు చేశారు. 100 మీటర్లలోపే డీజీపీ కార్యాలయం ఉన్నా.. దాడులు ఆపలేకపోయారని విమర్శించారు. డ్రగ్ మాఫియాకు రాష్ట్రం అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ కోరల నుంచి బయటపడేయాలని కోరితే ఇలా వ్యవహరిస్తారా ? అని ధ్వజమెత్తారు. ఏపీలో గంజాయి ఉత్పత్తి చేసి దేశం మొత్తం సరఫరా చేస్తుంటే ప్రశ్నించకూడదా ? అని చంద్రబాబు అన్నారు. డీజీపీ కార్యాలయం పక్కన దాడులు చేస్తే.. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు