TDP PRESIDENT CHANDRABABU NAIDU REMINDED CHIRANJEEVI BUT IGNORED PAWAN KALYAN IN HIS SPEECH AK
Chandrababu: చంద్రబాబు మాటల్లో ‘చిరంజీవి’.. పవన్ కళ్యాణ్ గురించి మర్చిపోయారా ?
చంద్రబాబు నాయుడు (ఫైల్)
Tdp Janasena: 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చే ఉండేదేమో కానీ.. టీడీపీ, జనసేన మరీ అంత ఘోరమైన పరాజయాన్ని మాత్రం మూటగట్టుకునేది కాదనే అభిప్రాయం రెండు పార్టీల్లోనూ ఉంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్య కొన్ని విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. కొద్దిరోజుల క్రితం జనసేనతో పొత్తు విషయంపై స్పందించిన చంద్రబాబు.. రాజకీయాల్లో పొత్తుల విషయంలో వన్ సైడ్ లవ్ వల్ల ప్రయోజనం ఉండదంటూ పరోక్షంగా జనసేనతో పొత్తు అంశంపై రియాక్ట్ అయ్యారు. తాజాగా 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ బరిలో ఉండకపోయి ఉంటే తాను అప్పుడు గెలిచి ఉండేవాడినని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారనే విషయాన్ని పక్కనపెడితే.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల ప్రభావం ఏ విధంగా ఉంటుంది. విపక్షాల నుంచి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏ రకంగా కౌంటర్లు వస్తాయనే దానిపై చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌కు కూడా వర్తిస్తాయా ? లేక ? కేవలం చిరంజీవికి మాత్రమే పరిమితమా ? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన మద్దతుతో బరిలోకి దిగి వైసీపీపై టీడీపీ విజయం సాధించింది. అయితే 2019కి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ... జనసేన వేరుగా పోటీ చేయడంతో తాము నష్టపోయామనే భావనలో టీడీపీ నేతలు, శ్రేణుల్లో ఉంది.
2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చే ఉండేదేమో కానీ.. టీడీపీ, జనసేన మరీ అంత ఘోరమైన పరాజయాన్ని మాత్రం మూటగట్టుకునేది కాదనే అభిప్రాయం రెండు పార్టీల్లోనూ ఉంది. అందుకే 2019 ఎన్నికల్లో ఏదో రకంగా జనసేనతో పొత్తు పెట్టుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని టీడీపీ నేతలు కూడా ఆఫ్ ది రికార్డ్ అభిప్రాయపడుతుంటారు. పలువురు టీడీపీ నేతలైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటనలు కూడా చేశారు.
చంద్రబాబు మాత్రం 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వల్లే తాను నష్టపోయాయని చెప్పి.. 2019లో పొత్తు పెట్టుకోని అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అయితే పదే పదే జనసేనతో పొత్తు అంశంపై వ్యాఖ్యలు చేయడం అంత సరికాదనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు.. ఈ అంశంపై మాట్లాడి ఉండకపోవచ్చనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చిరంజీవి రాజకీయ పార్టీ గురించి ప్రస్తావన తీసుకొచ్చిన చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ గురించి కావాలనే మాట్లాడలేదా ? వ్యూహాత్మకంగానే జనసేన ప్రస్తావన తీసుకురాలేదా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.