కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన చంద్రబాబు...ఏమన్నారంటే...

Chandrababu reaction on budget 2019 | కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదని, సామాన్య, మధ్య తరగతి పొదుపు శక్తి పెంచే దిశగా అంశాలు లేవని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

news18-telugu
Updated: July 5, 2019, 7:09 PM IST
కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన చంద్రబాబు...ఏమన్నారంటే...
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ, ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త బడ్జెట్ లేదని అన్నారు. రైతులు, మహిళలు, యువత ఆశలు నెరవేర్చే దిశగా బడ్జెట్ లేదని అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదని, సామాన్య, మధ్య తరగతి పొదుపు శక్తి పెంచే దిశగా అంశాలు లేవని ఆయన విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా విస్మరించారని అన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన తొలి ఏడాది ఆర్థికలోటు భర్తీని ఇంకా తేల్చలేదని గుర్తు చేశారు.

రూ.16 వేల కోట్ల లోటుకు గాను రూ.4 వేల కోట్లే ఇచ్చారని విమర్శించారు. ఇంకా ఇవ్వాల్సిన మిగిలిన మొత్తం గురించి బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం బాధాకరమని అన్నారు. ఏపీలో ఐఐటీ, నిట్, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ఐజర్ వంటి విద్యాసంస్థలకు నిధులు ఇవ్వలేదని అన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు గురించిన ప్రస్తావనే లేదని, తీవ్ర ఆర్థిక లోటు ఉన్న ఏపీని విస్మరించడం కేంద్రానికి తగదని చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో కేటాయింపులు లేవని విమర్శించారు.


First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...