బీజేపీలోకి టీడీపీ ఎంపీలు... చంద్రబాబు ఏమన్నారంటే...

బీజేపీలో చేరేందుకు సిద్ధమైన టీడీపీ ఎంపీలు... ఇందుకు సంబంధించి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును కలవడంతో... బీజేపీలో వారి చేరిక ఖరారైంది. ఈ పరిణామాలతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

news18-telugu
Updated: June 20, 2019, 5:11 PM IST
బీజేపీలోకి టీడీపీ ఎంపీలు... చంద్రబాబు ఏమన్నారంటే...
చంద్రబాబు (File)
news18-telugu
Updated: June 20, 2019, 5:11 PM IST
రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన టీడీపీ ఎంపీలు... ఇందుకు సంబంధించి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును కలవడంతో... బీజేపీలో వారి చేరిక ఖరారైంది. ఈ పరిణామాలతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మరోవైపు ఈ పరిణామంపై విదేశీ పర్యటనలో ఉన్న ఆ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. బీజేపీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు పార్టీ నేతలను ఫోన్ లో తెలిపారు. గతంలో తాము బీజేపీపై పోరాటం చేసింది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనన్నారు.

టీడీపీకి సంక్షోభాలు కొత్తకాదని, కార్యకర్తలు, నేతలు అధైర్యపడొద్దని చంద్రబాబు సూచించారు. ఎంపీలు పార్టీ వీడేందుకు దారి తీసిన పరిస్ధితులపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సహా పలువురు సీనియర్లతో చర్చలు జరుపుతున్నారు. రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకోవాలన్న ఆ పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఫోన్ కాల్ ద్వారా టీడీపీ సీనియర్ నేతలతో మాట్లాడిన చంద్రబాబు... టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని, నేతలు కార్యకర్తలు అధైర్య పడొద్దని సూచించారు. ఈ సందర్భంగా బీజేపీతో గత కొన్నేళ్లుగా చేసిన పోరాటంపైనా నేతలకు చంద్రబాబు వివరించారు.

మరోవైపు బీజేపీతో ఇంకా ఎవరెవరు ఎంపీలు టచ్ లో ఉన్నారు, కాకినాడలో టీడీపీ కాపు నేతల భేటీ వంటి అంశాలపైనా చంద్రబాబు సీనియర్ నేతలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సదరు నేతలతో వెంటనే మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం టీడీపీ నేతలతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు, సమస్య పరిష్కారం అవుతుందని కళా వెంకట్రావు మీడియాకు వివరించారు.First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...