తహశీల్దార్ హత్యపై స్పందించిన చంద్రబాబు... ఏమన్నారంటే...

విజయారెడ్డి, చంద్రబాబు

తెలంగాణలో తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై చంద్రబాబు ట్విట్టర్‌లో స్పందించారు.

  • Share this:
    తెలంగాణలో హత్యకు గురైన తహశీల్దార్ విజయారెడ్డి సంఘటనపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా తహసీల్దార్ హత్య దారుణమని, దురదృష్టకరమైన ఘటన అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తహసీల్దార్ విజయ, ఆమె డ్రైవర్ గురునాథం కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాజంలో అసహనం నానాటికీ ఎంతగా పెరిగిపోతుందో ఈ ఘటన ద్వారా అర్థమవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన కోరారు. టెక్నాలజీ పరంగా సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంటే మనిషి మాత్రం మానసికంగా ఎంతో క్రూరంగా, అనాగరికంగా తయారవడం శోచనీయం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.


    Published by:Kishore Akkaladevi
    First published: