చెదిరిన చంద్రబాబు కల... ఈ సారి తెలంగాణలో...

హుజూర్ నగర్ ఏపీకి సరిహద్దుల్లో ఉండే నియోజకవర్గం. ఈ కారణంగానే ఇక్కడ పోటీ చేయడం వల్ల తాము ఎంతో కొంత ప్రభావం చూపిస్తామని చంద్రబాబుతో పాటు టీ టీడీపీ నేతలు భావించారు.

news18-telugu
Updated: October 24, 2019, 1:15 PM IST
చెదిరిన చంద్రబాబు కల... ఈ సారి తెలంగాణలో...
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మంచి మెజార్టీతో విజయం సాధించింది. ఇప్పటివరకు తమను అందని ద్రాక్షగా ఉన్న ఈ సీటును ఎట్టకేలకు కైవసం చేసుకుంది. ఆర్టీసీ సమ్మె వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ... అవేవీ టీఆర్ఎస్ భారీ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. ఇంతకాలంగా తమ కంచుకోటగా ఉంటూ వస్తున్న ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ సంగతి ఇలా ఉంటే... హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపించి మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలం కావాలని ప్లాన్ చేసిన చంద్రబాబు ఆశలపై కూడా హుజూర్ నగర్ ఉప ఎన్నిక నీళ్లు చల్లిందనే టాక్ వినిపిస్తోంది.

హుజూర్ నగర్ ఏపీకి సరిహద్దుల్లో ఉండే నియోజకవర్గం. ఈ కారణంగానే ఇక్కడ పోటీ చేయడం వల్ల తాము ఎంతో కొంత ప్రభావం చూపిస్తామని టీ టీడీపీ నేతలు భావించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే రకమైన ఆలోచన చేశారని సమాచారం. ఇక్కడ గౌరవప్రదమైన ఓట్లు సాధిస్తే... ఆ తరువాత జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంతో కొంత పొలిటికల్ మైలేజీ ఉంటుందని టీ టీడీపీ నేతలు అంచనా వేశారు. ఆ ప్రభావంతో నేరుగా పోటీ చేయలేకపోయినా... ప్రధాన పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నించవచ్చని భావించారు.

కానీ టీటీడీపీ నేతలు, చంద్రబాబు వ్యూహం హుజూర్ నగర్‌లో ఏ మాత్రం ఫలించలేదని తెలుస్తోంది. హుజూర్ నగర్‌లో టీడీపీకి కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో... తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితులు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>