మాజీ ఎమ్మెల్యేకు చంద్రబాబు సరికొత్త ఆఫర్

పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమకు పార్టీ అధినేత చంద్రబాబు సరికొత్త ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 10, 2019, 5:35 PM IST
మాజీ ఎమ్మెల్యేకు చంద్రబాబు సరికొత్త ఆఫర్
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీని వీడాలని భావించిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు చంద్రబాబుకు పార్టీ పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్న నాయకుల్లో బొండా ఉమా కూడా ఉన్నారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. త్వరలోనే ఆయన దీనిపై నిర్ణయం తీసుకుంటారని బెజవాడ రాజకీయవర్గాలు భావించాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న బొండా ఉమతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు పార్టీలోని పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పార్టీలో తనకు అంతగా ప్రాధాన్యత లేదని ఫీలవుతున్న బొండా ఉమకు విజయవాడ టీడీపీ అర్బన్ అధ్యక్ష పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగుతున్న బుద్దా వెంకన్న ఇందుకోసమే తన పదవిని వదులుకునేందుకు సిద్ధమైనట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే బొండా ఉమతో చర్చలు జరిపేందుకు తాను వచ్చానని బుద్దా వెంకన్న అన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఇచ్చిన పార్టీ పదవి ఆఫర్‌తో బొండా ఉమ మెత్తబడ్డారని... సోమవారం ఆయన పార్టీ అధినేత చంద్రబాబును కలిసి పార్టీ మారబోనని ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.


First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>