కోడెల ఆత్మహత్య... పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం

కోడెల, చంద్రబాబు

గుంటూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు... కోడెల ఆత్మహత్య, అందుకు దారి తీసిన పరిణామాలపై పార్టీ నేతలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

  • Share this:
    ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యతో టీడీపీ దిగ్భ్రాంతికి గురైంది. ఈ నేపథ్యంలో ఆయన చనిపోవడానికి కారణమైన పరిణామాలు, తదితర అంశాలపై టీడీపీ సీనియర్ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు చర్చిస్తున్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు... ఈ అంశంపైనే పార్టీ నేతలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిణామాలతో పాటు దీనిపై ఏ రకంగా స్పందించాలనే అంశంపై కూడా చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా కోడెలతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. కోడెలపై కేసుల విషయంలో టీడీపీ ఆయనకు మద్దతుగా నిలిచిందని... ఈ విషయంలో తాను కూడా ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడానని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. కోడెల మరణంపై ట్విట్టర్‌లో స్పందించిన చంద్రబాబు...ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు.

    First published: