చంద్రబాబుతో భేటీ ఎఫెక్ట్... టీడీపీ నేతల్లో పెరిగిన ధీమా

పార్టీ తరపున అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు... ముందుగా ఆయా నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి ఏ విధంగా జరిగిందనే అంశంపై అభ్యర్థుల నుంచి నివేదికలు తీసుకున్నారు.

news18-telugu
Updated: April 23, 2019, 7:40 AM IST
చంద్రబాబుతో భేటీ ఎఫెక్ట్... టీడీపీ నేతల్లో పెరిగిన ధీమా
చంద్రబాబునాయుడు (File)
news18-telugu
Updated: April 23, 2019, 7:40 AM IST
టీడీపీ నేతల్లో కనిపిస్తున్న ఓటమి భయాన్ని తొలగించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నం ఫలితాలను ఇస్తున్నట్టు కనిపిస్తోంది. సోమవారం పార్టీ తరపున అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు... ముందుగా ఆయా నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి ఏ విధంగా జరిగిందనే అంశంపై అభ్యర్థుల నుంచి నివేదికలు తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి ఓటింగ్ తీరుపై తన దగ్గర ఉన్న సమాచారాన్ని వారికి చంద్రబాబు అందించినట్టు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయిన వెంటనే వైసీపీ నేతలు గెలుపు తమదే అంటూ ప్రచారం చేయడంతో... టీడీపీ నేతల్లో నిరాశ మొదలైంది.

అయితే పోలింగ్ సరళి తమకే అనుకూలమని ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా టీడీపీ అభ్యర్థులతో జరిగిన సమీక్షలోనూ ఆయన ఇదే రకమైన ధీమాను వ్యక్తం చేయడంతో పాటు ఇందుకు సంబంధించి తన దగ్గర పక్కా సర్వేలతో కూడా సమాచారం ఉందని వారికి తెలియజేశారు. అభ్యర్థులందరూ ఒకరి దగ్గర ఉన్న సమాచారాన్ని మరొకరు ఇచ్చిపుచ్చుకోవాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత ఓటింగ్ తీరుపై క్షుణ్ణంగా విశ్లేషించడంతో... కొందరు టీడీపీ అభ్యర్థులకు తమ గెలుపుపై భరోసా పెరిగిందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...