హోమ్ /వార్తలు /National రాజకీయం /

Chandrababu Naidu: అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. చంద్రబాబు మొదటగా ఫోకస్ చేసే సీటు అదేనా..?

Chandrababu Naidu: అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. చంద్రబాబు మొదటగా ఫోకస్ చేసే సీటు అదేనా..?

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Chandrababu Naidu: ఏపీలో టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్న చంద్రబాబు.. అందుకు తగ్గట్టుగానే పార్టీ నేతలకు సూచనలు చేస్తున్నారు.

  ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ఎప్పుడు ప్రజల్లోకి వస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో.. ఆయన మళ్లీ ప్రజల్లోకి వచ్చి పార్టీ తరపున ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఈ విషయంలో పార్టీ యువనేత లోకేశ్ కొంతమేర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లోకేశ్‌తో పాటు చంద్రబాబు కూడా స్వయంగా రంగంలోకి దిగాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. చంద్రబాబు రంగంలోకి దిగితేనే ఆశించిన స్థాయిలో ప్రయోజనం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ మళ్లీ జనంలోకి వెళ్లిన తరువాతే.. చంద్రబాబు కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.

  బహుశా వచ్చే ఏడాది నుంచి చంద్రబాబు మళ్లీ ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లే ఛాన్స్ ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్న చంద్రబాబు.. అందుకు తగ్గట్టుగానే పార్టీ నేతలకు సూచనలు చేస్తున్నారు. సమయం చూసుకుని తాను కూడా రంగంలోకి దిగుతానని నేతలకు భరోసా ఇస్తున్నారు.

  అయితే ఒకప్పుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం మీద పెద్దగా ఫోకస్ చేయని చంద్రబాబు.. ఈసారి మాత్రం కుప్పంలోనూ పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పంలోని టీడీపీ నేతలకు వేధింపులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని.. ఈ కారణంగానే అక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో ఫలితాలు టీడీపీకి వ్యతిరేకంగా వచ్చాయని చంద్రబాబు భావిస్తున్నారు.

  Chiranjeevi: క్లైమాక్స్‌కు చేరుకుంటున్న మా ఎన్నికలు.. లాస్ట్ పంచ్ మెగాస్టార్‌దేనా.. ఆయన మాటలకు అర్థమేంటి ?

  Fake Banking Apps: బ్యాంకింగ్ యాప్స్‌తో జరభద్రం.. ఫేక్ యాప్స్‌ను ఇలా గుర్తించండి..

  కుప్పంలోని టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాలంటే.. గతానికి భిన్నంగా అక్కడ కూడా పర్యటనలు చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లాలని ఎప్పుడు భావించినా.. మొదటగా కుప్పం నుంచే తన పర్యటనలను ప్రారంభించాలని చంద్రబాబు అనుకుంటున్నట్టు సమాచారం. ఇలా చేయడం వల్ల కుప్పంతో పాటు చిత్తూరు జిల్లా టీడీపీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం వస్తుందనే భావనలో చంద్రబాబు ఉన్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Chandrababu Naidu, Kuppam, TDP

  ఉత్తమ కథలు