మళ్లీ విశాఖ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయం...

విశాఖలో పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: February 28, 2020, 12:05 PM IST
మళ్లీ విశాఖ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయం...
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
విశాఖ నుంచి పోలీసులు తనను బలవంతంగా హైదరాబాద్ తరలించడాన్ని తప్పుబడుతున్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు... త్వరలోనే మళ్లీ తాను విశాఖలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. తనను ఎన్నిసార్లు ఆపగలుగుతారో చూస్తానని వ్యాఖ్యానించారు. విశాఖ ఘటనలో పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయటంతో పాటు న్యాయస్థానానికి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. నిన్నటి పరిణామాలపై పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనుమతి ఇచ్చిన కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.

పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పార్టీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసుల సహకారం లేకుండా వైసీపీ కార్యకర్తలు ఎలా విమానాశ్రయానికి రాగలిగారని ప్రశ్నించారు. కాన్వాయ్‌పై దాడికి దిగిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసుల సాయంతోననే వైసీపీ నిరసనలు అనేది స్పష్టం అయిందని అభిప్రాయపడ్డారు.
Published by: Kishore Akkaladevi
First published: February 28, 2020, 12:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading