• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TDP PRESIDENT CHANDRABABU NAIDU DECIDED TO SIDELINE SENIOR LEADERS WHO ARE NOT ACTIVE AK

Chandrababu Naidu: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆ నేతలకు షాక్

Chandrababu Naidu: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆ నేతలకు షాక్

చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫొటో)

Chandrababu Naidu: అధికార వైసీపీని ఎదుర్కొనే విషయంలో నేతలంతా దూకుడుగా ముందుకు సాగాలని సూచిస్తున్న చంద్రబాబు.. ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

  • Share this:
    ఏపీలో అధికార వైసీపీని ఎదుర్కొవడానికి దూకుడుగా ముందుకు సాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు... స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల కుప్పంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుచుకున్న తరువాత పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు చంద్రబాబు స్వయంగా కుప్పంలో పర్యటించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడి విజయం సాధించిందని.. అయినా టీడీపీ శ్రేణులకు తాను అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాల వల్ల పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని.. పార్టీ పటిష్టత కోసం స్థానిక నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని చంద్రబాబు వారికి సూచించారు.

    మరోవైపు తన కుప్పం పర్యటన ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు ఓ విషయంలో స్పష్టమైన సంకేతాలు పంపించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనేక మంది సీనియర్ నేతలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఉండటం లేదని చంద్రబాబుకు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన చంద్రబాబు.. సీనియర్ నేతలంతా పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని, వారికి ఎప్పటికప్పుడు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు. అయితే పలువురు సీనియర్ నేతలు మాత్రం చంద్రబాబు చెప్పిన విషయాన్ని పట్టించుకోవడం లేదని.. కేవలం ప్రెస్‌మీట్లు, ప్రకటనలు విడుదల చేసి ఊరుకుంటున్నారని చంద్రబాబు దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండని సీనియర్ నేతలను పక్కనపెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఇవ్వకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఎంతటి సీనియర్ నేతలైనా ఇదే వర్తిస్తుందని.. ఈ విషయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలు, నేతల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓ అభిప్రాయానికి వచ్చారు. ఇందుక సంబంధించి నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతల అభిప్రాయాలను తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్న చంద్రబాబు.. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు