Home /News /politics /

TDP PRESIDENT CHANDRABABU NAIDU DECIDED TO FIELD VARLA RAMAIAH IN RAJYA SABHA ELECTIONS AK

చంద్రబాబు కీలక నిర్ణయం... ఓడిపోతామని తెలిసీ...

అయితే ఆ తరువాత అతడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో వివాదం చెలరేగింది.

అయితే ఆ తరువాత అతడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో వివాదం చెలరేగింది.

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తమ అభ్యర్థిని ప్రకటించారు.

    ఏపీలో టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైయ్యింది. తమ పార్టీ తరపున సీనియర్ నేత, ఆర్టీసీ మాజీ చైర్మన్ వర్ల రామయ్యను బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. తాము రాజ్యసభ సీటు గెలిచే అవకాశం లేదని... అయినా అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ ఆగడాలను తెలియజేసేందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు టీడీపీ అధినేత వివరించారు. సంఖ్యాపరంగా చూసుకుంటే ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు సీట్లు వైసీపీ గెలుచుకునే అవకాశాలు స్పష్టం ఉన్నాయి. తమ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల బరిలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఉంటారని వైసీపీ ప్రకటించింది. ఈ నలుగురు రాజ్యసభకు ఎన్నిక కావడం దాదాపుగా లాంఛనమే. ఈ నలుగురి ఎన్నికతో రాజ్యసభలో వైసీపీ బలం ఆరుకు చేరనుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Rajya Sabha, Tdp, Varla ramaiah

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు