టీడీపీలో మార్పులు.. ఆ నేతకు ప్రమోషన్.. చంద్రబాబు నిర్ణయం ?

ఏపీ టీడీపీ కొత్త కమిటీ ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు.. ఈ నెల 27న దీనిపై ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది

news18-telugu
Updated: September 22, 2020, 3:12 PM IST
టీడీపీలో మార్పులు.. ఆ నేతకు ప్రమోషన్.. చంద్రబాబు నిర్ణయం ?
టీడీపీ అధినేత చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో అధికార వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పార్టీలో మరిన్ని మార్పులు చేయాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు స్థానంలో ఉత్తరాంధ్ర టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడును ఆ స్థానంలో నియమించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అధికార పార్టీపై విమర్శలు చేయడంలో దూకుడుగా ముందుకెళ్లడంతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన బీసీ సామాజికవర్గ నేత కావడం అచ్చెన్నాయుడుకు కలిసి వచ్చే అంశమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఏపీ టీడీపీ కమిటీ ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు.. ఈ నెల 27న దీనిపై ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు 13 జిల్లాల ప్రతిపాదికన పార్టీ అధ్యక్షులు ఉండగా.. కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్‌గా తీసుకుని అధ్యక్షులను నియమించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. ఏపీలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షులు నియామకం చేపట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని అనుబంధ విభాగాలను భర్తీ చేసిన చంద్రబాబు.. మరికొన్ని విభాగాలకు సంబంధించి కూడా పదవులను భర్తీ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: September 22, 2020, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading