Chandrababu On Telangana: ‘తెలంగాణ’పై చంద్రబాబు మళ్లీ దృష్టి పెట్టారా ?.. ఆ మాటలకు అర్థమేంటి ?

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Chandrababu Naidu: తెలంగాణలోని పరిస్థితులపై చంద్రబాబు కామెంట్స్ చేయడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని.. తెలంగాణలో కూడా ప్రజాస్వామ్యం దారుణంగా ఉందని చంద్రబాబు ఆరోపించారు.

  • Share this:
    టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్‌ లేదా వైసీపీపై విమర్శలు చేయడంలో కొత్తేమీ ఉండదు. గత లోక్‌సభ ఎన్నికల తరువాత బీజేపీని ఆయన విమర్శించిన దాఖలాలు కూడా పెద్దగా లేవు. ఇక తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్ చేయడం మాని చాలాకాలమే అవుతోంది. ఇక్కడి రాజకీయాలు, ప్రభుత్వాలపై చంద్రబాబు కామెంట్ చేయడం కూడా మానేశారు. ఇక్కడి వ్యవహారాలను పూర్తిగా టీటీడీపీకి వదిలేశారు. టీటీడీపీ బలోపేతంపై కూడా చంద్రబాబు పెద్దగా దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. దీంతో ఆయన తెలంగాణలో టీడీపీ మనుగడపై దాదాపుగా ఆశలు వదులుకున్నట్టే అనే వాదన వినిపించింది. ఏపీలో బలహీనపడుతున్న టీడీపీని తిరిగి బలోపేతం చేయడమే చంద్రబాబుకు అతి పెద్ద సవాల్ అని.. ఆయన మళ్లీ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టడం ఊహించలేమని అంతా అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆయన తెలంగాణలో పరిస్థితులపై వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఏపీలోని పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన తరువాత దానిపై స్పందించారు చంద్రబాబు. కొద్దిరోజుల క్రితం గాయపడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణను ఆయన నివాసంలో పరామర్శించిన చంద్రబాబు.. ఏపీలో పరిషత్ ఎన్నికలు జరిగిన తీరు... ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన ఏపీ సీఎం జగన్, వైసీపీని విమర్శించడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. అయితే తెలంగాణలోని పరిస్థితులపై చంద్రబాబు కామెంట్స్ చేయడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని.. తెలంగాణలో కూడా ప్రజాస్వామ్యం దారుణంగా ఉందని చంద్రబాబు ఆరోపించారు. .తనలాంటి వ్యక్తి కూడా తెలంగాణలో సమావేశం పెట్టుకునే పరిస్థితి లేదని ఆయన విమర్శించారు.

    Green Chilli: పచ్చి మిర్చిను దూరం పెడుతున్నారా ?..ఈ ప్రయోజనాలు మిస్ అవుతారు

    Revanth Reddy: యముడి గెటప్‌లో రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

    అయితే ఉన్నట్టుండి చంద్రబాబు తెలంగాణలోని పరిస్థితులపై విమర్శలు చేయడంపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని విమర్శించడం అంటే.. ఆయన అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టినట్టే అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొన్నేళ్లుగా ఎలాంటి విమర్శలు చేయని చంద్రబాబు.. ఇప్పుడెందుకు ఈ రకమైన కామెంట్స్ చేశారో చాలామందికి అంతుచిక్కడం లేదు. మరి.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుని కౌంటర్ ఇస్తుందా ? లేక లైట్ తీసుకుంటుందా ? అన్నది చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: