చిరంజీవిగా వర్ధిల్లాలి... మెగాస్టార్‌కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

news18-telugu
Updated: August 22, 2019, 11:48 AM IST
చిరంజీవిగా వర్ధిల్లాలి... మెగాస్టార్‌కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవి
  • Share this:
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పారు చంద్రబాబు. ‘స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోను కూడా చంద్రబాబు తన ట్వీట్‌లో పోస్ట్ చేయడం విశేషం.
చిరంజీవితో చంద్రబాబుకు దశాబ్దాలుగా సాన్నిహిత్యం ఉంది. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు ఆయనపై ఘాటు విమర్శలు చేసిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పాలి. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాటు మళ్లీ సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్న సందర్భంలో చంద్రబాబు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. ఇక త్వరలోనే సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్. ఈ సినిమాలో బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు.


First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు