తెలంగాణపై చంద్రబాబు మౌనం...వారిదీ అదే దారి

టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చంద్రబాబు సహా టీటీడీపీ నేతలు తెలంగాణలోని పార్టీ వ్యవహారాలపై చర్చించలేదని తెలుస్తోంది.

news18-telugu
Updated: August 10, 2019, 12:18 PM IST
తెలంగాణపై చంద్రబాబు మౌనం...వారిదీ అదే దారి
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ... శుక్రవారం తొలిసారి పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఓటమికి గల కారణాలపై చంద్రబాబు విశ్లేషించారు. ఎందుకు ఓడిపోయారనే అంశంపై పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న పరిణామాలపై సమావేశంలో పాల్గొన్న టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా... టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అసలు ఏ మాత్రం చర్చ జరగకపోవడం గమనార్హం. టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఇప్పటికీ తెలంగాణ నుంచి నాయకులు ఉన్నారు.

టీటీడీపీ నేతలు ఎల్. రమణ,రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే వాళ్లిద్దరూ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన వ్యవహారాల గురించి ప్రస్తావించలేదని తెలుస్తోంది. పార్టీకి అత్యంత కీలకమైన ఏపీలో పరిస్థితులు బాగోలేకపోవడం వల్లే తెలంగాణ టీడీపీ నేతలు ఈ సమావేశంలో టీటీడీపీ వ్యవహారాల గురించి మాట్లాడలేదని తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు సైతం సమావేశంలో పాల్గొన్న టీటీడీపీ నేతలను తెలంగాణలో పార్టీ పరిస్థితిపై వివరణ కోరలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం వల్లే ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ వ్యవహారాల అంశంపై చర్చ జరగలేదని మరికొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.


First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు