వైసీపీ చెబుతున్న రేట్లకు కరెంట్ దొరకదన్న చంద్రబాబు

ఐదేళ్లకు ముందు భారీగా కరెంట్ కోతలు ఉన్నాయని... వినూత్న కార్యక్రమాలతో పవర్ సెక్టార్‌ను అభివృద్ధి చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: July 17, 2019, 5:38 PM IST
వైసీపీ చెబుతున్న రేట్లకు కరెంట్ దొరకదన్న చంద్రబాబు
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
పీపీఏలపై వైసీపీ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్లకు ముందు భారీగా కరెంట్ కోతలు ఉన్నాయని... వినూత్న కార్యక్రమాలతో పవర్ సెక్టార్‌ను అభివృద్ధి చేశామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిరంతర విద్యుత్ అందించాలనే ఉద్దేశ్యంతో ప్రణాళికతో ముందుకెళ్లామని అన్నారు. వైసీపీ నేతలు చెబుతున్న రేటు ఎక్కడా విద్యుత్ దొరకదని చంద్రబాబు అన్నారు. నోటికి వచ్చిన రేట్లతో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రం మార్గదర్శకాలను వైసీపీ మార్చి చూపిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అధికారులు వివరణ మాత్రమే ఇవ్వాలని... వాళ్లు ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కాలక్రమంలో విద్యుత్ ధరలు తగ్గుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. థర్మల్ విద్యుత్ వల్ల సమస్యలు వస్తున్నందునే సంప్రదాయేతర విద్యుత్‌పై దృష్టి పెట్టామని అన్నారు. సీఎం జగన్ ఏర్పాటు చేస్తానన్న జ్యుడిషియల్ కమిషన్ సాధ్యం కాకపోవచ్చని చంద్రబాబు అన్నారు. కార్యనిర్వహక వ్యవస్థలో జ్యుడీషియల్ జోక్యం ఉండదని తెలిపారు. ఇందుకు న్యాయవ్యవస్థ అంగీకరించకపోవచ్చన్నారు.


First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు