బీజేపీ A టీమ్.. టీఆర్ఎస్ B టీమ్: చంద్రబాబు

తెలంగాణ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. కేసీఆర్‌పై విమర్శలు సంధిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించిన చంద్రబాబు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభించిన విధానాలను ఎండగట్టారు.

news18-telugu
Updated: December 2, 2018, 6:04 PM IST
బీజేపీ A టీమ్.. టీఆర్ఎస్ B టీమ్: చంద్రబాబు
చంద్రబాబునాయుడు (File)
  • Share this:
గ్రేటర్‌హైదరాబాద్‌లో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. మలక్ పేట, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించిన చంద్రబాబు.. కేసీఆర్ నాలుగేళ్ల పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. బంగారు తెలంగాణ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. ప్రజాకూటమికి ఓటేస్తే తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.

కేంద్రంలోని బీజేపీ టీమ్ A అయితే.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ B టీమ్‌గా పనిచేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని.. వారికి మజ్లిస్ అధినేత ఓవైసీ మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. తాను బంగారు బాతు లాంటి హైదరాబాద్‌ను తయారు చేసి ఇస్తే.. కేసీఆర్ దుబారా చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేశారని చంద్రబాబు విమర్శించారు.

తాను చేసిన అభివృద్ధివల్లే హైదరాబాద్ నగరానికి భారీగా వలసలు మొదలయ్యానని.. కేసీఆర్ వల్ల నగర ప్రతిష్ట దెబ్బతిన్నదని చంద్రబాబు విమర్శించారు. తాను మొదలు పెట్టిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించాయని.. కేసీఆర్ మాత్రం అభివృద్ధి నిరోధకుడిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. అంతు చూస్తామంటూ కేటీఆర్, కేసీఆర్ బెదిరిస్తున్నారని.. బెదిరిస్తే తాను భయపడబోనని చంద్రబాబు స్పష్టం చేశారు. తన దగ్గర పెరిగిన కేసీఆర్.. ఇప్పుడు తననే తిడుతున్నారని.. అయినా తెలంగాణ ప్రజలకోసం భరిస్తున్నానని చెప్పారు.
Published by: Santhosh Kumar Pyata
First published: December 2, 2018, 6:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading