చంద్రబాబు వరుస సమీక్షలు... టీడీపీకి అంతుచిక్కని ఓటరు నాడి ?

వచ్చే నెల నుంచి మరోసారి నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్ష నిర్వహించాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 40 మందిని ఈ సమావేశానికి ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: April 23, 2019, 11:12 AM IST
చంద్రబాబు వరుస సమీక్షలు... టీడీపీకి అంతుచిక్కని ఓటరు నాడి ?
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 23, 2019, 11:12 AM IST
ఏపీలో ఎన్నికలు పూర్తయి పది రోజులు గడిచిపోయింది. అయితే ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. మొదట వైసీపీ గెలుపు ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత టీడీపీ నేతలు సైతం మరోసారి ఎన్నికల్లో విజయం తమదే అని ధీమా వ్యక్తం చేయడంతో... మే 23న వెలువడబోయే ఫలితాలు ఎవరి పక్షమో అంచనా వేయడం కష్టమైపోయింది. అయితే ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ అతిగా ప్రచారం చేసుకుంటోందని పార్టీ నేతలకు వివరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... మరోసారి కచ్చితంగా మనమే గెలుస్తామని పార్టీ నేతల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులందరితో సమావేశమైన చంద్రబాబు... వారి నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. అభ్యర్థులందరూ పక్కా సమాచారాన్ని తెప్పించుకుని తన దగ్గరకు రావాలని ఆదేశించిన చంద్రబాబు... టీడీపీ గెలుపు విషయంపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదని పార్టీ నేతలకు సూచించారు. ఇంతవరకు బాగానే ఉన్నా... వచ్చే నెల నుంచి మరోసారి నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్ష నిర్వహించాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 40 మందిని ఈ సమావేశానికి ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది.

నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలు, నేతలందరినీ ఈ సమావేశానికి పిలిచి... క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే చంద్రబాబు చేస్తున్న సమీక్షలను బట్టి చూస్తే... టీడీపీకి ఓటరు నాడి అంతుబట్టడం లేదేమో అనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో పోరు హోరాహోరీగా ఉందని... అందుకే టీడీపీ ఫలితాలను అంచనా వేయడం కోసం మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతోందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తానికి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయనే దానిపై టీడీపీ చేస్తున్న సమీక్షలను బట్టి చూస్తే... ఆ పార్టీకి ఓటరు నాడి అంత సులువుగా చిక్కడం లేదనే సందేహాలు కలుగుతున్నాయి.First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...