Home /News /politics /

TDP POLITBURO DEMANDS FOR SOUTH KOREA TYPE OF EX GRATIA FOR LG POLYMERS VICTIMS BA

వాళ్లకెలాగో, వీళ్లకీ అలాగే... ఎల్జీ పాలిమర్స్ పరిహారంపై టీడీపీ కొత్త డిమాండ్

విశాఖ విషాద ఘటనకు ఏడాది

విశాఖ విషాద ఘటనకు ఏడాది

బ్లీచింగ్ పౌడర్ కొనుగోలులో కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్ల అవినీతికి పాల్పడిందని టీడీపీ పొలిట్‌బ్యూరో ఆరోపించింది.

    తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నేడు సమావేశమైంది. ఆన్ లైన్ వీడియో కాల్‌ ద్వారా ఈ సమావేశం జరిగింది. మహానాడు నిర్వహణతో పాటు ఏపీలోకరోనా వైరస్, ఎల్జీ పాలిమర్స్ ఘటన, రైతుల సమస్యల మీద పొలిట్‌బ్యూరో సభ్యులు చర్చించారు. టీడీపీ మహానాడును వర్చువల్ గా నిర్వహించడంపై పోలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. అందులో చేపట్టాల్సిన తీర్మానాలు, కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. గ్యాస్ లీకేజి మృతులకు నివాళులు అర్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, -బాధితులకు అండగా ఉండాలని తీర్మానాన్ని ఆమోదించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసేయాలని, నిందితులను శిక్షించాలని, బాధితులను ఆదుకోవాలని తీర్మానం ఆమోదించారు. ‘ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. ఇది మానవ తప్పిదం కాబట్టి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలి. 12మంది చావుకు కారణమైన ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని శిక్షించాలి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి.’ అని డిమాండ్ చేశారు. దక్షిణ కొరియాలో, ఇతర దేశాల్లో ఇలాంటి దుర్ఘటనలు జరిగిన చోట్ల ఇచ్చిన పరిహారాలను అధ్యయనం చేసి విశాఖ బాధితులకు మెరుగైన పరిహారం అందజేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.

    రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే కరోనా రాష్ట్రంలో విస్తృతం అయ్యిందని నేతలు ఆరోపించారు. ‘గుంటూరులో వైసిపి నాయకుడు ఇచ్చిన విందు వల్ల దుష్ఫలితాలు చూశాం. వైసీపీ ఎమ్మెల్యేలే కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారారు. శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ల ర్యాలీ, నగరిలో, కనిగిరిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి వైరస్ వ్యాప్తికి కారణం.’ అని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో కూడా చివరికి బ్లీచింగ్ లో కూడా రూ.70కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపించింది. ‘కరోనా కిట్ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారు. నాసిరకం శానిటైజర్లు, నాసిరకం మాస్క్ లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కిరోసిన్ కంపు కొడుతున్నాయని మాస్క్ లు అక్కడే పారేశారు.’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు విమర్శించారు. లాక్ డౌన్ లో మద్యం దుకాణాలను తెరవడాన్ని ఖండించారు. మద్యం దుకాణాల వద్ద టీచర్లను నియమించడాన్ని ఖండించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Chandrababu naidu, Tdp, Vizag gas leak

    తదుపరి వార్తలు