Home /News /politics /

TDP POLITBUREO MEMBER AYYANNA PATRUDU FIRE ON AP CM YS JAGANMOHAN REDDY FOR NOT RESPONDING ON VISAKHA STEEL PLANT BA GNT

‘స్టీల్ ప్లాంట్ పోయినా పర్వాలేదు గానీ నన్ను మాత్రం జైల్లో పెట్టొద్దు అంటారా?’.. జగన్‌పై టీడీపీ నేత ఫైర్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటీకరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనీసం స్పందించలేదని, ముఖ్యమంత్రి వైఖరి చూస్తుంటే స్టీల్ ప్లాంట్ పోయినా ఫర్వాలేదు కానీ.. తనను మాత్రం జైల్లో పెట్టొద్దని అన్నట్టుగా ఉందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.

ఇంకా చదవండి ...
    విశాఖ స్టీల్ ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటీకరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనీసం స్పందించలేదని, జగన్ వైఖరి చూస్తుంటే స్టీల్ ప్లాంట్ పోయినా ఫర్వాలేదు కానీ.. తనను మాత్రం జైల్లో పెట్టొద్దని అన్నట్టుగా ఉందని తెలుగుదేశం పార్టీ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. విశాఖలో స్టీల్ ప్లాంటు కావాలని ఉమ్మడి ఏపీలో అన్ని జిల్లాల్లో ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అని ఎంతో మంది ఉద్యమం చేశారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆ ఉద్యమం పలితంగానే విశాఖకు స్టీల్ ప్లాంట్ వచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటి ప్రాజెక్టును అమ్మేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఆ రోజు ఉద్యమంలో చాలా మంది విద్యార్థులు చనిపోయారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు ఉద్యమంలో ఇప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ అమ్మకం గురించి సీఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మెడలు వంచి ఫ్యాక్టరీ అమ్మకుండా అడ్డుకుంటారా? అని నిలదీశారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

    విజయసాయిరెడ్డి అయితే చాలా ఎక్కువగా మాట్లాడతారని, మరి విశాఖ ఉక్కు గురించి పార్లమెంటులో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎంపీలంతా ఎందుకు మాట్లాడటం లేదని, ఉత్తరాంధ్రలో భూములన్నీ దోచుకుంటున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ పోతే ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖలో జరిగే పరిణామాలు చూస్తుంటే ఉన్న పరిశ్రమలను వాళ్లే కొనేసుకుంటున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. భీముని పట్నం రోడ్డులోని బేపార్కు వాళ్లను బెదిరించి వాటాలు కొనేసుకున్నారని, కార్తీక వనం ప్రాజెక్టు వాళ్లను బెదిరించి వాటాలు కొన్నారని ఆరోపించారు. స్టీలు ప్లాంటు కూడా విజయసాయిరెడ్డి డైరెక్షన్ లో జగన్ కొంటున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. దాని కోసమే ఇదంతా చేస్తున్నారని, రెండేళ్లలో బారీగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ప్రజలంతా కలిసి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని, అన్ని పార్టీలు కలిసి ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకుండా చేసి భావితరాల వారికి అన్యాయం జరక్కుండా చూసుకోవాలన్నారు. విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, విదేశీ స్వదేశీ కంపెనీలకు కేంద్రం అమ్మాలనుకోవడం బాధాకరమన్నారు. దీనిపై కేంద్ర పెద్దలు ఆలోచించాలని ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకుండా చూడాల్సిన బాధ్యత వెంకయ్యనాయుడుపై కూడా ఉందన్నారు. ఆనాడు ఫ్యాక్టరీ పెట్టడానికి రైతులు ముందుకు వచ్చి 24వేల ఎకరాలిచ్చి నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు అమ్మేస్తారా? అని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ కదలకుండా చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఏపీలో అతిపెద్ద పరిశ్రమ ఉక్కు ఫ్యాక్టరీ అని పేర్కొన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ayyannapatrudu, Tdp, Visakhapatnam, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు